/rtv/media/media_files/2025/02/16/KFfyCg9hwDFPrLkpstfw.jpg)
Zelenskyy
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తప్పుడు సమాచారం అనే వలయంలో చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విమర్శించారు. అలాగే తనను అధ్యక్ష పదవి నుంచి దింపేయాలనుకునే ప్రయత్నం విఫలం అవుతుందని అన్నారు.ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్ స్కీ ప్రజామోదం తగ్గిపోతుందని ట్రంప్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ స్పందన వచ్చింది.
Also Read: Delhi: మహిళలు రాజ్యమేలిన వేళ...ఢిల్లీలో నాలుగోసారి మహిళా సీఎం
ఎవరైనా నా స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటే ఆ ప్రయత్నం విఫలం అవుతుంది. నా ప్రజామోద రేటింగ్ కేవలం నాలుగు శాతంగా ఉందనేది రష్యా నుంచి వచ్చిన ఓ తప్పుడు సమాచారం. అందులో ట్రంప్ ఇరుక్కుపోయారు. అని టీవీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
Also Read: Rekha Gupta: ఫస్ట్ టైం MLAకే CM పదవి.. స్టూడెంట్ లీడర్ నుంచి ఢిల్లీ సీఎం పీఠం
ఉక్రెయిన్ గురించి ట్రంప్ బృందం వాస్తవాలను తెలుసుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ను తన దేశంలో ఏ ఒక్కరూ విశ్వసించరని అన్నారు. రష్యా ఇచ్చే రాయితీలను తన ప్రజలు అంగీకరించరని స్పష్టం చేశారు.
యుద్ధాన్ని ముగించేందుకు..
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు మంగళవారం అమెరికా-రష్యా మధ్య చర్చలు మొదలైన సంగతి తెలిసిందే.అందుకు సౌదీ అరేబియా వేదికైంది.ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకుండా ఆ రెండు దేశాల విదేశాంగ మంత్రులు తొలివిడత సమాలోచనలు జరిపారు. ఒక ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు.
అమెరికా పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్ కాఫ్, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ట్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. రష్యా తరుఫున క్రెమ్లిన్ ప్రతినిధి యూరీ ఉషకొవ్ కూడా హాజరయ్యారు.సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిల్ సల్మాన్ దీనిలో కీలకపాత్ర పోషించారు. తమభాగస్వామ్యం లేకుండా తమ గురించి జరుగుతోన్న చర్చల్లో భాగంగా చేసుకునే ఒప్పందాలను తాము అంగీకరించబోమని ఇది వరకే ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందన వచ్చింది. జెలెన్ స్కీ నేతృత్వంలో ఉక్రెయిన్ అతిపెద్ద విధ్వంస ప్రదేశంగా మారిపోయిందని మండిపడ్డారు. అసలు ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించాలని...జెలెన్ స్కీకి కేవలం 4 శాతం మాత్రమే ప్రజామద్ధతు ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. రష్యాతో యుద్ధానికి ఉక్రెయినే అసలు కారణమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు.దండయాత్రం మొదలు కాకముందే రష్యాతో ఒప్పందం చేసుకొని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
ఉక్రెయిన్ ను పక్కనపెట్టారన్న ప్రచారాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కొట్టిపారేశారు. దానితో సంప్రదింపులు జరుపుతామని పేర్కొన్నారు.ఎవరినీ పక్కన పెట్టం. ఉక్రెయిన్ తో పాటు మా ఐరోపా భాగస్వాములు,ఇతరులతోనూ చర్చలు జరుపుతామనిపేర్కొన్నారు.
Also Read: Delhi CM Rekha Gupta : ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. బీజేపీ MLAలు ఏకగ్రీవ తీర్మానం
Also Read: కుంభమేళాలో 90వేలపైగా ఖైదీలకు పుణ్యస్నానాలు.. పాపాలు కడిగేయనున్న యూపీ సర్కార్