/rtv/media/media_files/2025/02/16/KFfyCg9hwDFPrLkpstfw.jpg)
Zelenskyy
తాజాగా ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా దాడులకు పాల్పడింది. అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత నగరమై క్రీవీ రిపై శుక్రవారం రష్యా మిసైల్‌తో దాడి చేసినట్లు కీవ్ అధికారులు తెలిపారు. పిల్లలు ఆడుకునే సమీపంలో ఈ దాడి జరగడంతో 18 మృతి చెందారు. వీళ్లలో 9 మంది చిన్నారులే ఉన్నారు. మరో 60 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఐదు అపార్ట్‌మెంట్ భవనాలు కూడా దెబ్బతిన్నాయి.
ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ తీవ్రంగా స్పందించారు. ఇవి ప్రమాదవశాత్తు జరగలేదని రష్యా పక్కా ప్లాన్ ప్రకారమే చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా ఉద్దేశపూర్వకంగానే క్రీవీరిలో ఇంధన సౌకర్యాలు ఉండే ప్రాంతంపై మిసైల్‌ను ప్రయోగించింది. దీంతో రష్యా అమెరికాతో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని విస్మరించింది. ఉక్రెయిన్‌లో శాంతి కోసం కృషి చేస్తామని రష్యన్లు చేసిన వాగ్దానాలు ఈ దాడులతో ముగిసిపోయాయి. దౌత్యం అంటే ఏంటో వాళ్లకి తెలియదు. యుద్ధాన్ని ముగించే ఉద్దేశం రష్యాకు లేదనే విషయం మరోసారి తేలిపోయిందని'' జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికాపై మండిపాటు..
దాంతో పాటూ ఇప్పుడు అమెరికా మీదనా విరుచుకుపడుతున్నారు జెలెన్ స్కీ. రష్యా దాడులపై అమెరికా వెంటనే స్పందించింది. అయితే ఎక్కడా రష్యా పేరును చెప్పకుండా మాట్లాడింది. దీనిపై జెలన్ మండిపడుతున్నారు. రష్యా పేరును నేరుగా చెప్పడానికి అమెరికా భయపడుతోందని ఆరోపించారు. పేరుకే అగ్రరాజ్యం కానీ చాలా బహీనమైన దేశంగా ప్రవర్తిస్తోందని అన్నారు. రష్యా చర్యలను అమెరికా మరింత తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు. పిల్లలను చంపిన క్షిపణి గురించి మాట్లాడేటప్పుడు వారు "రష్యన్" అనే పదాన్ని చెప్పడానికి కూడా భయపడుతున్నారు అని జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యాపై విమర్శలలో అమెరికా మరింత ప్రత్యక్షంగా ఉండాలని వాదించారు.
today-latest-news-in-telugu | ukraine | zelensky | russia
Also Read: USA: అసలు మామూలు డీల్ కాదిది..సుంకాలు తగ్గించేందుకు ట్రంప్ చైనాకు ఆఫర్