Iran: ''మీ నౌకలను ముంచేస్తాం''.. అమెరికాకు ఇరాన్‌ సంచలన వార్నింగ్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ ముదురుతున్నాయి. తాజాగా ఇరాన్.. అమెరికాకు మరో సంచలన వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ ప్రయోగించే మొదటి క్షిపణికే అమెరికా నౌకలు సముద్రంలో మునిగిపోతాయంటూ హెచ్చరించింది.

New Update
'Your ships will be sunk by our first missiles', Iran warns US over Strait of Hormuz

'Your ships will be sunk by our first missiles', Iran warns US over Strait of Hormuz

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ ముదురుతున్నాయి. తాజాగా ఇరాన్.. అమెరికా(us iran war) కు మరో సంచలన వార్నింగ్ ఇచ్చింది. హర్మూజ్‌ జలసంధిపై ఆధిపత్యం కోసం అమెరికా యత్నిస్తే ఊరుకునేది లేదని ఇరాన్ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ సైనిక సలహాదారు మోహ్‌సేన్ రెజాయి అన్నారు. తమ మిస్సైల్స్ అత్యంత కచ్చితత్వంతో దాడులు చేయగలవని హెచ్చరించారు. ఇరాన్ ప్రయోగించే మొదటి క్షిపణికే అమెరికా నౌకలు సముద్రంలో మునిగిపోతాయంటూ వార్నింగ్ ఇచ్చారు. 

Also Read: ట్రంప్ చమురు దెబ్బ.. ఇరాన్‌కు రోజుకు రూ. 4 వేల కోట్ల నష్టం!

Iran Warns US Over Strait Of Hormuz 

హర్మూజ్‌ జలసంధికి రక్షక భటుడిగా మారాలనుకుంటున్న ట్రంప్ వైఖరిని రెజాయి తప్పుబట్టారు. ఈ ప్రాంతంలో అమెరికా బలగాలకు ముప్పు పొంచి ఉన్నట్లు హెచ్చరించారు. ఇరాన్‌పై భూతల దాడులకు అమెరికా సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ అమెరికా సైనికులు ఇరాన్ భూభాగంలోకి వస్తే వాళ్లని బందీలుగా పట్టుకుంటామన్నారు. ఇలా పట్టుబడ్డ ఒక్కో సైనికుడిని వదిలించుకోవాలంటే అమెరికా ప్రభుత్వం బిలియన్ డాలర్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని సెటైర్లు వేశారు. తమ సైనిక సామర్థ్యం ముందు అమెరికా వ్యూహాలు సాగవంటూ తేల్చిచెప్పారు. 

Also Read: ప్రపంచ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. చమురు ధరలు భారీగా తగ్గుతాయన్న ట్రంప్‌

అంతేకాదు ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నానని రెజాయ్ అన్నారు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల వల్ల ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నారు. ఇప్పటికే ఈ జలసంధిని, ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్భందించింది.  ఇరాన్ ఓడరేవుల్లోకి వెళ్లే లేదా అక్కడి నుంచి బయటకు వచ్చే అన్ని నౌకలను అడ్డుకోవాలని ఇప్పటికే ట్కంప్ యంత్రాంగం నేవీని ఆదేశించింది. ఈ క్రమంలోనే తమ ఓడరేవులకు వచ్చే నౌకలను అడ్డుకుంటే హర్మూజ్‌ను పూర్తిగా మూసివేస్తామని..అమెరికా నౌకలపై క్షిపణి దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. 

Advertisment
తాజా కథనాలు