/rtv/media/media_files/2025/03/12/MyhSg4ZxAqO5m8TBodry.jpg)
Yogi Adityanth trending in Nepal
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక్కసారిగా నెపాల్‌లో ట్రెండ్ అయ్యారు. రాచరిక పాలనకు మద్దతుగా అక్కడ జరుగుతున్న ర్యాలీల్లో యోగీ ఆదిత్యనాథ్ ఫొటో కూడా కనిపిస్తోంది. ఈయన ఫొటో ర్యాలీలో ప్రదర్శించేందుకు ఓ కారణం కూడా ఉంది. నేపాల్‌లో రాచరికానికి యోగి ఆదిత్యనాథ్ బలమైన మద్దతుదారుగా ఉన్నారు. మాజీ రాజు జ్ఞానేంద్ర షాతో యోగికి మంచి సంబంధాలున్నాయి.
Also Read: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్‌లో ఏరులై పారిన నెత్తురు!
ఈ ఏడాది జనవరిలో జ్ఞానేంద్ర షా.. భారత్‌లో పర్యటించారు. అప్పుడు ఆయన యోగి ఆదిత్యనాథ్‌తో కూడా భేటీ అయ్యారు. ఇదిలాఉండగా.. నేపాల్‌లో రాచరికానికి మద్దతు తెలిపే రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ వాళ్లు ఈ ర్యాలీ నిర్వహించారు. నేపాల్‌లో రాజు పాలనను మళ్లీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ తరుణంలోనే మాజీ రాజు జ్ఞానేంద్ర షా ఫొటోలతో పాటు యోగి ఆదిత్యనాథ్ చిత్రాలను కూడా ప్రదర్శించారు.
Also Read: ఆన్‌లైన్ గేమ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలి.. ఫోన్‌కు ఫోరెన్సిక్ పరీక్ష!
అయితే ఈ ర్యాలీలో ఇతర దేశ నాయకులు ఫొటోలు ప్రదర్శించడంపై పలువురు విమర్శలు కూడా చేశారు. దీనిపై ఆర్‌పీపీ పార్టీ ప్రతినిధి మాట్లాడారు. తాము చేస్తున్న ఉద్యమానికి చెడ్డపేరు తెచ్చేందుకే ప్రధానమంత్రి కేపీ ఓలీ వర్గం ఇలాంటి చర్యలకు కుట్రకు పాల్పడిందని అన్నారు. ప్రధాని ముఖ్య సలహాదారు అయిన బిష్ణు రిమాల్ సూచనల మేరకే ఈ ర్యాలీలో యోగి చిత్రాన్ని ప్రదర్శించారని ఆర్‌పీపీ ప్రతినిధి సోషల్ మీడియాలో తెలిపారు. ఇదిలాఉండగా.. ఇటీవల కాఠ్‌మాండూ, పోఖార సహా దేశవ్యాప్తంగా రాచరికాన్ని పునరుద్ధరించాలనే ర్యాలీలు కూడా జరిగాయి. 2008లో జరిగిన తీవ్రమైన ప్రజా ఉద్యమం వల్ల అక్కడ రాజుల పాలన అంతమైంది. ఈ క్రమంలోనే మళ్లీ ఇప్పుడు రాజుల పాలనను పునరుద్ధరించాలని నిరసనలు చేస్తున్నారు.
Also Read: మరోసారి విషం చిమ్మిన పాకిస్థాన్.. ట్రైన్ హైజాక్‌కు భారత్ సాయం చేసిందని ఆరోపణలు