/rtv/media/media_files/2025/02/11/8PJo1GgsBTn6RHbiHW0d.jpg)
World Corrupt Countries List
ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ 2024లో ప్రపంచ అవినీతి దేశాల లిస్ట్ ను తయారు చేసింది. ఇందులో 0 నుంచి 100 వరకు ర్యాంకింగ్ లను ఇచ్చింది. దాంతో ఏఏ దేశాలకు ఎంత స్కోర్లు వచ్చాయన్నది కూడా పొందుపరిచింది. ఎంత ఎక్కువ స్కోర్ వస్తే అంత తక్కువ కరప్షన్ చేసినట్టు అని వివరించింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ బెర్లిన్ లో కరప్షన్ పర్సప్షన్స్ ఇండెక్స్ (CPI) ఆధారంగా ఈ లిస్టు రిలీజ్ చేసింది.
ప్రపంచంలో అవినీతి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో పెద్ద సమస్యగా ఉంది. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు అగ్రరాజ్యం అమెరికాతో సహా అన్ని దేశాల్లో విపరీతంగా ఉంది. అయితే ఖొన్ని దేశాల్లో చాలా ఎక్కువ ఉంటే మరి కొన్ని దేశాల్లో చాలా తక్కువ ఉంది. కానీ మొత్తానికి ప్రతీచోట ఈ విష వృక్షం వేళ్ళూనుకుని పాతుకుపోయింది అనేది మాత్రం సత్యం. ప్రస్తుతం సీపీఐ రిపోర్ట్ ప్రకారం 2012 నుంచి 2024 వరకు 32 దేశాలు అవినీతిని తగ్గించుకున్నాయి. కరప్షన్ తగ్గించేందుకు 148 దేశాలు ఇంకా శ్రమించాల్సి ఉంది. ఇందులో రెండులో మూడొంతుల దేశాలు 50 స్కోర్ కు కిందనే ఉన్నాయని రిపోర్ట్ చెబుతోంది.
తక్కువ అవినీతి టాప్ 10 దేశాలు...
అన్నింటికంటే డెన్మార్క్ లిస్ట్ లో టాప్ నంబర్ వన్ గా ఉంది. 90వ ర్యాంక్ తో అతి తక్కువ అవినీతి కలిగిన దేశంగా నిలిచింది. దీని తరువాత స్థానాల్లో ఫిన్ ల్యాండ్ 88, సింగపూర్ 84, న్యూజిలాంగ్ 83, లక్జెంబర్గ్ 81లు టాప్ లిస్ట్ లో ఉన్నాయి. మిగతా స్థానాల్లో ర్యాంక్ 5 స్విట్జర్లాండ్(స్కోర్:81), ర్యాంక్ 8: స్వీడన్ (Score:80), ర్యాంక్ 9: నెదర్లాండ్స్ (Score: 78), ర్యాంక్ 10: Australia (Score: 77) లు ఉన్నాయి.
ఎక్కువ అవినీతి ఉన్న దేశాలు...
కరప్షన్ ఎక్కువ ఉన్న దేశాలలో కేవలం 8 పాయింట్ల స్కోర్ తో, లాస్ట్ ర్యాంక్ (180)తో సౌత్ సుడాన్ టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత నికరాగువా 14, గినియా 13, లిబియా 13, యెమెన్ 13, సోమాలియా (179), వెనుజులా (178), సిరియా (177), సౌత్ నుడాన్ 8లతో ఉన్నాయి.
ఈ లిస్ట్ లో పాకిస్తాన్ 27 స్కోరుతో 135 స్థానంలో ఉండగా...భారత్ 2023తో పోల్చితే 3 స్థానాలు తగ్గి 96 స్థానంలో ఉంది. ఇక మరోపక్క దేశమైన చైనా 43 పాయింట్లతో 76 వర్యాంకులో ఉంది. అంటే చైనా కంటే మనం తక్కువ స్థానంలో ఉన్నాము. పాకిస్తాన్ కంటే అవినీతి తక్కువ చేస్తున్నా చైనా కంటే మాత్రం ఎక్కువే చేస్తున్నామని తేలింది.
Also Read: Mega Star: ఓన్లీ మూవీస్, నో పాలిటిక్స్..మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన