/rtv/media/media_files/2024/12/08/yxHEygWTftT7cVJAsa9F.jpg)
Volodymyr Zelenskyy
నిన్న వైట్ హౌస్ లో రచ్చ రచ్చ అయింది. అమెరికాతో ఖనిజాల తవ్వకం ఒప్పందం గురించి మాట్లాడ్డానికి వచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఈ చర్చల మధ్యలో ఇరు దేశాధినేతలకూ గొడవ అయింది. ఉక్రెయిన్ తగ్గి ఉండాలని, శాంతి కోసం ప్రయత్నం చేయడం లేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాము ఎవరికీ తలవంచనక్కర్లేదు అంటూ జెలెన్ స్కీ ఎదురుతిరిగారు. దీంతో ఇద్దరి మధ్యా మాటల యుద్ధం జరిగింది. ఆ తరువాత చర్చలను మధ్యలోనే వదిలిపెట్టి జెలెన్ వెనక్కు వెళ్ళిపోయారు. దీంతో ని్న అమెరికా, మీడియా అంతా హోరెత్తి పోయింది.
ప్రపంచం మమ్మల్ని అర్ధం చేసుకోవాలి..
ఈ సంఘటన తర్వాత జెలెన్ స్కీ తన దేశం గురించి, ఆ ప్రజలను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఉక్రెయిన్ ఆవేదనను ప్రపంచం వినాలని ఆయన కోరారు. తమ ఆలోచనలను, నడిచే విధానాన్ని ప్రతీదేశం గుర్తిస్తుందని ఆశిస్తున్నాను అంటూ రాసుకొచ్చారు. ఉక్రెయిన్‌లోని ప్రజలు తాము ఒంటరి కాదని గుర్తించుకోవడం ముఖ్యమని చెప్పారు. ఏది ఏం జరిగినా ఉక్రెయిన్ ప్రజలు తమ గళాన్ని వినడం మర్చిపోకూడదని గుర్తు చేశారు జెలెన్.
ఇక నిన్న జరిగిన గొడవ గురించి ప్రపంచ దేశాలు స్పందించాయి. దాదాపు అన్ని దేశాలూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కు సపోర్ట్ గా నిలిచారు. ముఖ్యంగా ఐరోపా, దేశాలు, నాటో దేశాలు ఆయన ఒంటరి వారు కాదుఅంటూ మద్దతునిచ్చాయి. అమెరికా, ట్రంప్ తీరును తప్పుబడుతూ వరుసగా పోస్ట్ లు పెట్టారు.
Also Read: Kerala: 65 లక్షల అప్పు కోసం వరుస హత్యలు...కేరళ మర్డర్స్ మిస్టరీ