/rtv/media/media_files/2025/01/29/uCvbCwWnWsc52kz79BJQ.jpg)
ruby
కెనడా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు జస్టిన్ ట్రూడో (Justin Trudo) ప్రకటించిన నేపథ్యంలో తదరుపరి ప్రధాని ఎన్నిక ఆసక్తిగా మారింది. ఇందుకోసం లిబరల్ పార్టీ తరఫున పోటీ పడుతున్న వారిలో భారత సంతతి వ్యక్తుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ జాబితా నుంచి అనితా ఇందిరా ఆనంద్ వైదొలగనున్నట్లు ఇటీవల ప్రకటించగా..తాజాగారూబీ డల్లాపార్టీ నాయకురాలి రేసులో చేరిపోయారు.
తాను ప్రధానిగా ఎన్నికైతే అక్రమ వలసదారులను బహిష్కరిస్తానని హామీ ఇస్తూ ఆన్ లైన్ లో ప్రచారం మొదలు పెట్టారు.
Also Read:Maha Kumbh: మహా కుంభమేళాలో హృదయ విదారక ఘటన.. తల్లిదండ్రులను వదిలేసిన కొడుకులు
అసలేవరి రూబీ డల్లా?
1970ల్లో కెనడా (Canada) కు వలసవెళ్లిన ఓ పంజాబీ కుటుంబంలో రూబీ జన్మించారు. భిన్న కుటుంబ నేపథ్యమున్నరూబీ..అందాల పోటీలు, నటన, వ్యాపార తదితర రంగాల్లో తనదైన ముద్ర వేశారు. కెనడాతో పాటు లిబరల్ పార్టీ అంటే ఎంతో మక్కువ చూపించే ఆమె..స్వయం కృషితో ఎదిగిన వ్యాపారవేత్తగా అభివర్ణించుకుంటారు.
పొలిటికల్ సైన్స్ లో మైనర్ తో పాటుబయో కెమిస్ట్రీలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం డాక్టర్ ఆఫ్ చిరో ప్రాక్టిక్ పట్టా పొందారు. రాజకీయాల్లోకి రాకముందు చిరో ప్రాక్టర్ గా ,నటిగానూ చేశారు.1993 మిస్ ఇండియా-కెనడా అందాల పోటీల్లో రన్నరప్ గా నిలిచారు.
వ్యాపారవేత్తగా ఎదిగిన ఆమె..ఢల్లా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు సీఈవో,అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
రాజకీయాల్లోకి ఎలా అంటే..
ఆమెకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడే లిబరల్ పార్టీతో రూబీ పని చేయడం ప్రారంభించినట్లు తెలుస్తుంది. బ్రాంప్టన్ -స్ప్రింగ్‌డేల్ నియోజకవర్గం నుంచి 2004లో తొలిసారి పార్లమెంట్ కు ఎన్నికైన ఆమె 2011వరకు కొనసాగారు. కెనడా పార్లమెంటుకు వరుసగా మూడుసార్లు ఎన్నికైన భారత సంతతి మహిళా నేతగా రికార్డు సృష్టించారు.
తాజాగా ప్రధాన మంత్రి రేసులో ఉన్నానని ప్రకటించుకున్న ఆమె..అక్రమ వలసదారుల పై ఉక్కుపాదం మోపుతానని హామీ ఇస్తున్నారు.
Also Read:Hussain Sagar Boat Fire: హుస్సేన్‌సాగర్‌లో బోటు ప్రమాదం.. అజయ్ మృతదేహం లభ్యం
ప్రధానిగా అక్రమ వలసదారులను బహిష్కరించడంతో పాటు మానవ అక్రమ రవాణాను కట్టడి చేస్తా. ఇది నా హామీ అంటూ రూబీ ఓ వీడియో విడుదల చేశారు.అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాదిరిగానే ఢల్లా హామీలు ఉండడంతో సామాజిక మాధ్యమాల్లో ఈమె పై భిన్న స్పందనలు వస్తున్నాయి.
Also Read:Supreme Court: తల్లికి అక్రమ సంబంధం.. తండ్రి ఎవరో తెలుసుకోడానికి కోర్టుకెక్కిన కొడుకు
Also Read:Maharashtra: అలా చేశావేంటమ్మా.. చనిపోయాక ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు బాలిక సూసైడ్..