/rtv/media/media_files/2024/11/07/3sHpKoRIGgFTXgxNUua9.jpg)
White House
ప్రతీకార సుంకాలను ఆపేది లేదని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వైట్ హౌస్. ఏది ఏమైనా టారీఫ్ లను కొనసాగిస్తామని చెప్పారు. మా విధానంలో ఎటువంటి మార్పూ ఉండదు అన్నారు. అయితే ఏ దేశమైనా టారీఫ్ ల మీద చర్చకు వస్తే తాము సుముఖంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేయాలని ఆలోచిస్తున్నారనే వార్తలను వైట్ హౌస్ ఖండించింది. దానిపై వస్తున్న వార్తలన్నీ నకిలీవి అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు.
.@PressSec: Reports that @POTUS is considering a 90-day pause on tariffs are FAKE NEWS. pic.twitter.com/UfXO1BhwYW
— Rapid Response 47 (@RapidResponse47) April 7, 2025
ఒక్క పోస్ట్ తో అంతా తారుమారు..
నిన్న ఎక్స్ లో వాల్టర్ బ్లూమ్ బెర్గ్, నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్ కెవిన్ హాసెట్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజుల సస్పెన్షన్ గురించి ఆలోచిస్తున్నారని పోస్ట్ లు వచ్చాయి. దీంతో మార్కెట్లో గందరగోళం మొదలైంది. ఈ ఒక్క పోస్ట్ తో స్టాక్ మార్కెట్ హెచ్ థగ్గులకు గురైంది. దీని గురించే ఈరోజు వైట్ హౌస్ మాట్లాడింది. హాసెట్ చెప్పినదాన్ని జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ట్రంప్ కు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే అసలు ఈ చర్చ అంతా బిలియనీర్ హెడ్జ్ ఫండ్ పెట్టుబడిదారుడు, ట్రంప్ మద్దతుదారుడు అయిన బిల్ అక్మాన్ ఆదివారం ట్రంప్ అసమాన సుంకాల ఏర్పాట్లను పరిష్కరించడానికి, దేశానికి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడానికి "90 రోజుల గడువు" అమలు చేయాలని సూచించిన తర్వాత చర్చ ప్రారంభమైంది.
today-latest-news-in-telugu | usa | donald trump tariffs | white-house
Also Read: RCB VS MI: ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది