/rtv/media/media_files/2025/03/19/L8l7frXMKqDBSDxp0ctw.jpg)
Sunita Williams
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్ భూమిపై ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున (భారత కాలమాన ప్రకారం) 3.27 AM గంటలకు భూమిపైకి చేరుకున్నారు. ఫ్లోరిడా సముద్ర జలాల్లో వాళ్ల క్యాప్సుల్ ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత సునీతా విలియమ్స్‌తో పాటు మరో ముగ్గురు వ్యోమగాములను బయటికి తీసుకొచ్చారు. అనంతరం సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను ప్రత్యేక విమానంలో నాసా సెంటర్‌కు తీసుకెళ్లారు.
టెక్సాస్‌లోని హోస్టన్‌లో ఉన్న నాసా సెంటర్‌లో వీళ్లిద్దరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. వీళ్లను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఏం చేయాలనేది వైద్య పరీక్షల అనంతరం ఓ నిర్ణయానికి వస్తారు. భూమి గ్రావిటీకి తగ్గట్లుగా ఈ ఆస్ట్రోనాట్స్‌ను మార్చేందుకు చర్యలు మొదలుపెడతారు. తొమ్మిది నెలలుగా వారు అంతరిక్షంలో గడపడం వల్ల భూమిపై వెంటనే నడవలేని పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం సునీతా విలియమ్స్‌కు 59 ఏళ్లు. ఇప్పటికే ఆమె ఐదుసార్లు అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. వయసు రీత్యా చూసుకుంటే మానసిక, శారీరక ఒత్తిడి ఉంటుంది.
Also Read: భారత్‌కు రానున్న సునీతా విలియమ్స్.. గ్రామంలో సంబురాలు
ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండటం వల్ల బుచ్ విల్మోర్ కంటే సునీతా విలియమ్స్ మానసికంగా, శారీరంగా చాలా ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. స్పేస్‌లో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి వ్యోమగాములు గాల్లోనే తేలుతుంటారు. భూమిపైకి వచ్చాక సాధారణ పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్లకి ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా కొన్ని నెలల పాటు ఎక్సర్సైజ్‌లు చేయాల్సి ఉంటుంది. వాళ్లు సొంతంగా నడిచేవరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారు.
అంతరిక్షంలో తక్కువ గురుత్వాకర్షణ వాతావరణంలో జీవించడం వల్ల కండరాల క్షీణత, ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఆస్ట్రోనాట్స్ భూమిపై ఉన్నప్పుడులా కండరాలు కదిలించలేరు. కాబట్టి, కాలక్రమేణా వారి బలం తగ్గుతుంది. అంతరిక్షంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ, వారు బలహీనంగానే ఉంటారు. మళ్లీ పూర్తి బలాన్ని తిరిగి పొందడానికి కొంత టైం పడుతుంది. రక్త ప్రసరణలో కూడా మార్పులు వస్తాయి. ఎముకల కదలికల్లో నొప్పి ఉండొచ్చు. కంటి చూపుతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతాయి. అందుకే సునీతా విలిమమ్స్, బుచ్ విల్మోర్‌కు మళ్లీ సాధారణ పరిస్థికి వచ్చి, నడిచేవరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారు.
Also Read: దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా బీజేపీ నేత.. ఆస్తులెంతంటే ?