USA:  గ్రేట్ పీపుల్ మాత్రమే అమెరికాకు రావాలి..ట్రంప్

హెచ్ 1 బీ వీసాల మీద జరిగిన డిబేట్ లో కొత్త అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు. ఈ వీసాలపై రిపబ్లికన్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో సమర్ధవంతులైన ప్రజలే అమెరికాకు రావాలని ట్రంప్ అన్నారు. 

New Update
D Trump

d trump

వీసాల విస్తరణ మీద రిపబ్లికన్ పార్టీలో పెద్ద చర్చే జరిగింది. పార్టీలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొంత మంది అమెరికా ఫస్ట్ విధానానికి కట్టుబడి ఉన్నామని చెబుతుంటే మరికొంతమంది చట్టబద్దమైన వలసలకు మద్దతు ఇస్తామని అంటున్నారు. దీనిపై తాజాగా నూతన అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇరు వర్గాల వాదనలు విన్నానని...నిజానికి తనకూ రెండూ నచ్చాయని చెప్పారు. కానీ సమర్ధవంతమైన, గ్రేట్ పీపుల్ మాత్రమే అమెరికాకు రావాలన్నది తన ఆకాంక్ష అని చెప్పారు. దాని కోసం ఎటువంటి విధానాలు పాటించాలో వాటిని అనుసరిస్తామని చెప్పారు. కేవలం ఐటీ ప్రోఫెషనల్స్ గురించి మాత్రమే తాను చెప్పడం లేదని...అన్ని రకాల జాబ్స్ వారి గురించి మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు.  దేశ వ్యాపారాలను విస్తరింపచేసేందుకు మాకు సమర్థవంతమైన, నైపుణ్యం కలిగిన వ్యక్తులు కావాలి. అది కేవలం హెచ్‌1బీ వీసాతో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే నేను రెండు వాదనలనూ సమర్థిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు ట్రంప్.

భిన్న వాదనలు...

మరోవైపు చట్టబద్ధమైన వలసలకు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి మద్దతునిచ్చారు. అర్హత కలిగిన సాంకేతిక నిపుణులను హెచ్ 1బీ వీసాల ద్వారా అమెరికాకు తీసుకురావాలని వారు అన్నారు. ఇక పార్టీకి చెందిన నిక్కీ హేలీ మాత్రం అమెరికా ఫస్ట్ నినాదానికి మాత్రమే తాము సపోర్ట్ చేస్తామని చెప్పారు. తాను  సౌత్‌ కరోలినా గవర్నర్‌గా పనిచేసినప్పుడు అక్కడి  నిరుద్యోగ రేటు 11 శాతం నుంచి 4 శాతానికి తగ్గింది. అదంతా కేవలం విదేశీ ఉద్యోగులను కాకుండా పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించాం కాబట్టే అది సాధ్యమైందని చెప్పారు. అమెరికన్లకే శిక్షణ ఇస్తే వారు రాణిస్తారని నిక్కీ అన్నారు. అన్నింటికంటే ముందు విద్యారంగంపై ద్రుఫ్టి పెట్టాలని అన్నారు. 

మరోవైపు మొట్టమొదటగా అమెరికా విదేశాంగ మంత్రి.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ అయ్యారు.  న్యూ ఢిల్లీకి ప్రాధాన్యతనిస్తూ వాషింగ్టన్‌ ఈ భేటీని ఏర్పాటు చేసింది. రూబియోతోపాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్‌ వాల్జ్‌తోనూ జైశంకర్‌ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ట్రంప్ కు, మోదీకి ధ్యన కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. దీన్ని బట్ట ట్రంప్ 2.0లో ఇండియాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని..మంచే జరగొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

Also Read: Bengaluru: బస్సు కోసం అడిగితే ఎత్తుకెళ్ళి రేప్ చేశారు..బెంగళూరు టెర్రర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు