USA VS Iran: ఆ చర్చలు ఫెయిల్ అయితే ఇరాన్‌పై దాడులు చేస్తాం.. అమెరికా సంచలన వార్నింగ్

అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే వైట్‌హౌస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు ఫెయిల్ అయితే బలప్రయోగానికి కూడా ట్రంప్‌ వెనకాడరని అన్నారు.

New Update
Khamenie and Trump

Khamenie and Trump

అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు ప్రారంభం కానున్నాయి. ఒమన్ వేదికగా జరగనున్న ఈ చర్చల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నాయనే దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే వైట్‌హౌస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు ఫెయిల్ అయితే బలప్రయోగానికి కూడా ట్రంప్‌ వెనకాడరని అన్నారు. గురువారం మీడియాతో లీవిట్‌ మాట్లాడారు. 

ఒమన్‌లో జరగనున్న చర్చల్లో ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ట్రంప్‌ ఎదురుచూస్తున్నారని చెప్పారు. అణురహిత ఇరాన్‌ డిమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ దౌత్యం సాధ్యం కాకుంటే ట్రంప్‌కు మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీకి ట్రంప్‌ హెచ్చరికలు చేశారు. ఖమేనీ కలత చెందక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.    

Also Read: అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. సంతకాలు జరిగేది అప్పుడే : పియూశ్‌ గోయల్

మరోవైపు రివల్యూషనరీ గార్డ్స్‌ స్థావరంలో ఉన్న అండర్‌ గ్రౌండ్‌లో ఇరాన్‌.. దీర్ఘశ్రేణి ఖొర్రామ్‌షహర్‌-4 క్షిపణులను మోహరించినట్లు స్థానిక మీడియా చెప్పింది. అమెరికాకు చెందిన విమాన వాహక నౌకలు, యుద్ధ నౌకలు, నిఘా విమానాలతో సహా చాలామంది అదనపు దళాలు ఇప్పటికే ఈ ప్రాంతంలో మోహరించాయి. 

ఇదిలాఉండగా ఇరాన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లో వేలాందిమంది ఆందోళనకారులు మృతి చెందారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. ఆందోళనకారులకు ఏదైనా జరిగితే తాము జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు అమెరికా ఇరాన్‌ వైపు యుద్ధనౌకలు పంపించడం మరింత ఉద్రిక్తతలను పెంచింది. అనంతరం ఇరుదేశాలు అణు చర్చలు జరిపేందుకు అంగీకరించాయి. అయితే శుక్రవారం ఒమన్ వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి. ఇందులో భాగంగా అణు చర్చలతో సహా మరికొన్ని అంశాలపై కూడా చర్చించాలని ఇరాన్ భావిస్తున్నట్లు సమాచారం. 

Also Read: ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు.. చరిత్రలో మొదటిసారిగా

Advertisment
తాజా కథనాలు