H1B Visa Dropbox: హెచ్ 1 బీ వీసాదారులకు షాక్..డ్రాప్ బాక్స్ రూల్స్ కఠినతరం

హెచ్ 1 బీ వీసాదారులకు మరిన్ని కష్టాలు ఎదురవ్వనున్నాయి. డ్రాప్ బాక్స్ రూల్స్ ను మరింత కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక మీదట 12 నెలల్లో గడువు తీరిన వీసాలను మాత్రమే ఇంటర్వ్యూలు లేకుండా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. 

New Update
USA Tourist Visa:యూఎస్ పర్యాటక వీసాదారులకు గుడ్‌న్యూస్..డ్రాప్ బాక్స్ సదుపాయం

H1B Visa Dropbox: వీసాల విషయంలో అగ్రరాజ్యం ఒక్కో రూల్ ను నెమ్మదిగా మార్చుకుంటూ వస్తోంది. మొత్తానికి ఇతర దేశాల వాళ్ళు అంత ఈజీగా రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. తాజాగా డ్రాప్ బాక్స్ విధానంలో కూడా మార్పులు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వీసా రెన్యువల్ కోసం డ్రాప్ బాక్స్ విధానం అమల్లో ఉంది. దీనిలో ఇంటర్వూలు లేకుండా వీసాలను రెన్యువల్ చేసుకోవచ్చును. దీనికి ఇప్పటివరకు 48 నెలల టైమ్ ఉండేది. అంటే వీసా అయిపోయాక 48 నెలల వరకు ఇంటర్వ్యూలకు అటెండ్ అవకుండా డ్రాప్ బాక్స్ ద్వారా పొందవచ్చును. ఇప్పుడు ఆ కాలాన్ని 12 నెలలకు తగ్గిస్తారని చెబుతున్నారు. ఈ రూల్ ను తక్షణమే అమల్లోకి తీసుకువస్తారని కూడా అంటున్నారు. అయితే దీన్ని ఎటువంటి అధికార ప్రకటన లేకుండానే అమల్లోకి తీసుకువచ్చేశారని  కూడా అంటున్నారు. వీసా కేంద్రాల్లో కొత్త నిబంధనను అమలు చేస్తున్నారని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. 

Also Read: Vallabhaneni Vamsi Arrest Case: నా భర్తను జైల్లో చంపేస్తారు.. వల్లభనేని వంశీ భార్య సంచలన ఆరోపణలు!

హెచ్ 1 బీ, టూరిస్ట్ వీసాల మీద ప్రభావం..

ఈ కొత్త రూల్ వల్ల ముఖ్యంగా హెచ్ 1 వీసాదారులే కాకుండా టూరిస్ట్ వీసాదారుల మీద కూడా ప్రభావం పడనుంది. వీరు వీసా పునరుద్ధరణకు సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. నిజానికి కోవిడ్ కు ముందు ఈ కొత్త రూలే అమల్లో ఉండేది. అయితే కోవిడ్ టైమ్ లో వీసాల జాప్యం చాలా జరిగింది. దాంతో గుట్టలుగా వీసాలు పేరుకుపోయాయి. అందుకే అప్పుడు 12 నెలల కాలాన్ని 48 నెలలకు పెంచి తొందరగా వీసాలు ఇష్యూ అయ్యేలా చేశారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎత్తేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఢిల్లీ, ముంబయి వంటి ప్రధాన నగరాల్లో బీ1/బీ2 వంటి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ కోసం 440 రోజులకు పైగా నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు మరింత ఎక్కువమంది ఇంటర్వ్యూలకు వస్తే ఈ వీసాల జారీ ఇంకా ఆలస్యం కానుంది.

Also Read: Bujji Thalli Song: 100 మిలియన్ వ్యూస్.. యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న 'బుజ్జితల్లి' సాంగ్

Also Read: Chhaava Box Office Collections: రష్మిక నటించిన ఛావా సినిమాకు రికార్డ్ కలెక్షన్స్

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)

సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీకి రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌ గగనతలంలో ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది. మోదీ విమానం ఆ దేశంలోకి వెళ్లగానే 6ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌గా వచ్చాయి. 2వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశానికి ఆయన అక్కడికి వెళ్లారు.

New Update
Saudi Arabia visit

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 2 రోజుల పాటు ఆయన సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ బయల్దేరి వెళ్లారు. ప్రధానికి సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తోన్న విమానం ఆ దేశ గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్‌ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌‌కు చెందిన ఎఫ్‌-15 విమానాలు దానిని ఎస్కార్ట్‌గా వచ్చాయి. మోదీ ప్రయాణిస్తు్న్న విమానానికి ఇరువైపులా మూడేసి చొప్పున 6 జెట్ ఫైటర్లు ఎస్కార్ట్‌గా నిలిచి స్వాగతం పలికాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

సౌదీకి బ‌య‌లుదేరి వెళ్లడానికి ముందు ప్రధాని ఓ ట్వీట్ చేశారు. ఇటీవ‌ల 2 దేశాల మ‌ధ్య బంధం మ‌రింత దృఢ‌మైంద‌న్నారు. ర‌క్షణ‌, వాణిజ్య, పెట్టుబ‌డి, ఎనర్జీ రంగాల్లో స‌హ‌కారం పెరిగింద‌న్నారు. ప్రాంతీయంగా శాంతి, సామ‌ర‌స్యం, స్థిర‌త్వం పెంచేందుకు ఇండియా, సౌదీ దేశాలు క‌ట్టుబ‌డి ఉన్నట్లు తెలిపారు.

Also read: BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు

ప్రధాని హోదాలో మోదీ సౌదీ వెళ్లడం ఇది మూడోసారి అయినా.. జెడ్డాకు వెళ్లడం ఇదే మొద‌టిసారి. రెండ‌వ స్ట్రాట‌జిక్ పార్ట్నర్‌షిప్ కౌన్సిల్ స‌మావేశంలో ఆయ‌న పాల్గొనున్నారు. ప్రధాని తన పర్యటనలో జెడ్డాలో ఆ దేశంతో 6 ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. సౌదీ ఆరేబియా చ‌క్రవ‌ర్తి మ‌హ‌మ్మద్ బిన్ స‌ల్మాన్ అల్ సౌద్‌తో జ‌రిగే చ‌ర్చల్లో భార‌తీయ యాత్రికుల‌కు చెందిన హ‌జ్ కోటా గురించి మాట్లాడ‌నున్నారు.

(saudi-arabia | modi-visit | Air escort)

Advertisment
Advertisment
Advertisment