Iran-US Peace Talks: ఇరాన్‌తో మళ్లీ చర్చలు.. కానీ రెండు షరతులు విధించిన అమెరికా

పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా అమెరికా-ఇరాన్ మధ్య రెండోసారి చర్చలు జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. మరో రెండ్రోజుల్లో ఈ చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు.

New Update
US Wants To Restart Talks With Iran, But It Has 2 Key Conditions

US Wants To Restart Talks With Iran, But It Has 2 Key Conditions

Iran-US Peace Talks: పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా అమెరికా-ఇరాన్ మధ్య రెండోసారి చర్చలు జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. మరో రెండ్రోజుల్లో ఈ చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు. అయితే ఈ చర్చలకు ముందు అమెరికా ఇరాన్‌కు రెండు కీలక కండీషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి ప్రధానంగా హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు లేకుండా పూర్తిగా తెరవాలి. రెండోది ఇరాన్ ప్రతినిధులు ఒప్పందంపై నిర్ణయం తీసుకునేందుకు IRGC నుంచి అనుమతులు తెచ్చుకోవాలి. ఈ రెండు షరతులకు ఇరాన్ ఒప్పుకుంటే తాము చర్చలకు సిద్ధమేనని అమెరికా చెప్పినట్లు తెలుస్తోంది. 

Also Read: అరుణాచల్‌ప్రదేశ్‌ పేరు మార్చిన చైనా.. భూభాగం మాదే అంటూ బలుపు మాటలు

ప్రస్తుతం ఇరాన్ పాలక వర్గంలో ఈ చర్చల విషయంపై తీవ్ర అంతర్గత విభేదాలు నెలకొన్నట్లు సమాచారం. ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఈ చర్చల విషయంపై ఇరాన్ పాలక వర్గంలో అంతర్గత విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ చర్చల పట్ల ఆసక్తి చూపించినప్పటికీ.. IRGC ఆంక్షల విషయంలో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అందుకే ఈసారి IRGC నుంచి స్పష్టమైన అనుమతులు ఉండాలనే షరతును అమెరికా పెట్టింది.  

Also Read: అండమాన్‌ సముద్రంలో పడవ బోల్తా.. 250 మంది గల్లంతు

మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం గడువు ఏప్రిల్ 21తో ముగియనుంది. ఈ గడువు ముగిసేలోపే శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరుదేశాలు భావిస్తున్నాయి. ఒకవేళ చర్చలు సఫలమైతే పశ్చిమాసియాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు ఉండే అవకాశాలు ఉన్నాయి.  

Advertisment
తాజా కథనాలు