/rtv/media/media_files/2025/03/16/DUUxnv5Rvn86zc3QJ2FJ.jpg)
H 1B Visa
అమెరికా ప్రభుత్వం రిపబ్లికన్స్ చేతుల్లోకి వచ్చాక, అధ్యక్ష పదవి ట్రంప్ చేపట్టాక..ఇక్కడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. అమెరికా మొత్తాన్ని మార్చాలని ట్రంప్ ప్రభుత్వం అనుకుంటోంది. ఇప్పటికే వలసవిధానాల్లో, సుంకాల్లో మార్పుల చేసింది. అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో సైతం వారివారి దేశాలకు పంపేస్తున్నారు.
మళ్ళీ రూల్స్ మరతాయా?
ఈ క్రమంలో యూఎస్ విదేశాంగ మంత్రి రూబియో వలస విధానానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. వీసాలు, ఇమ్మిగ్రేషన్ రూల్స్ ఇక మీదట మారతాయని ఆయన చెప్పారు. ఈ రెండింటినీ విదేశీ వ్యవహారాల కిందకు తీసుకురావాలనుకుంటున్నామని అన్నారు. అదే అయితే కనుక వీసా నిబంధనల్లో మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు. అమెరికాలో పనిచేయాలని, చదువుకోవాలని, ఇక్కడ పర్యటించాలని అనుకొనే భారతీయులు భారీ మార్పులను చవిచూసే అవకాశం ఉంది. వీసా ఆమోదాలు, పునరుద్ధరణ విషయంలో యాజమాన్యాలు, ఉద్యోగస్తులు అంతరాయం ఎదుర్కొనే అవకాశం ఉందని రూబియో చెప్పారు. దీని వలన హెచ్-1బీ నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియపై అనిశ్చితిని పెంచుతుందన్నారు.
Also Read: Podcost: ప్రధాని మోదీతో ఫ్రిడ్ మన్ ఎపిక్ పాడ్ కాస్ట్
వీసాల విషయంలో అగ్రరాజ్యం ఒక్కో రూల్ ను నెమ్మదిగా మార్చుకుంటూ వస్తోంది. మొత్తానికి ఇతర దేశాల వాళ్ళు అంత ఈజీగా రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఈ మధ్యనే డ్రాప్ బాక్స్ విధానంలో కూడా మార్పులు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వీసా రెన్యువల్ కోసం డ్రాప్ బాక్స్ విధానం అమల్లో ఉంది. దీనిలో ఇంటర్వూలు లేకుండా వీసాలను రెన్యువల్ చేసుకోవచ్చును. దీనికి ఇప్పటివరకు 48 నెలల టైమ్ ఉండేది. అంటే వీసా అయిపోయాక 48 నెలల వరకు ఇంటర్వ్యూలకు అటెండ్ అవకుండా డ్రాప్ బాక్స్ ద్వారా పొందవచ్చును. ఇప్పుడు ఆ కాలాన్ని 12 నెలలకు తగ్గించారు. ఈ రూల్ ను తక్షణమే అమల్లోకి కూడా తీసుకువచ్చారు.
Also Read: Bangladesh: అబ్బా దారుణం..8ఏళ్ళ బాలిక రేప్..మూడు సార్లు గుండెపోటుతో మృతి