/rtv/media/media_files/2025/04/14/3GOywLSrGmNoxdeCVJrU.jpg)
Nikitha Kasap
నికితా కాసాప్...17 ఏళ్ళ టీనేజీ కుర్రాడు. ట్రంప్ అన్నా, అతని ప్రభుత్వం అన్నా చాలా కోపం. అందుకే అధ్యక్షుడిని చంపాలనుకున్నాడు. అలా చేస్తే రిపబ్లికన్ ప్రభుత్వం కూడా కూలిపోతుందని భావించాడు. దీని కోసం ఒక రష్యన్ తో ప్రణాళికలు కూడా వేశాడు. అయితే ఇదంతా చేయాలంటే డబ్బులు కావాలి. ట్రంప్ ను డైరెక్ట్ గా చంపలేడు. దాని కోసం ఆయుధాలు కావాలి. అవి సమకూర్చుకోవాలంటే బోలెడంత డబ్బు కావాలి. ఎలా అని ఆలోచించాడు. అతనికి ఒకటే ఒక్క మార్గం తట్టింది. అదే తల్లిదండ్రులను చంపేయడం. అంతే ఇంకేం ఆలోచించకుండా తన పేరెంట్స్ ను క్రూరంగా చంపేశాడు. ఇదీ అమెరికాలోని టీనేజర్ నికితా కథ.
తీవ్రవాద భావజాలం..
నికితా తన పేరెంట్స్ ను గన్ తో కాల్చి చంపేశాడు. ఆ తరువాత కొన్ని రోజుల పాటూ ఆ శవాలతోనే ఇంట్లోనే ఉన్నాడు. తరువాత వారి దగ్గర నుంచి 14 వేల డాలర్లను, పాస్ పోర్ట్, తన పెంపుడు కుక్కతో వేరే చోటికి పారిపోయాడు. ఈ విషయం ఎవరికీ వెంటనే తెలియలేదు. ఫిబ్రవరి 28న అధికారులు టిటాయానా, మేయర్ మృతదేహాలను కనుగొన్నారు. అంతకు ముందు నికితా ఇంట్లో నుంచి శవాలు కుళ్ళిపోయి వాసన వస్తుంటే...పక్కన ఉన్నవాళ్లు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దానికి తోడు మేయర్ గత రెండు వారాలుగా పనికి రాకపోవడం, నికితా కాసాప్ స్కూలుకు రాకపోవడంతో ఈ హత్యలు వెలుగులోకి వచ్చాయి. దాంతో మొత్తం విషయం అంతా బయటపడింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన నికితా కాన్సాస్ లో తలదాచుకున్నాడు. ట్రంప్ ను చంపేందుకు డ్రోన్, పేలుడు పదార్థాలను కొన్నాడు. కానీ చివరకు పోలీసులకు దొరికిపోయాడు. అతని దగ్గర హిట్లర్‌ని ప్రశంసిస్తూ మూడు పేజీల యాంటిసెమిటిక్ మ్యానిఫెస్టోని కూడా పోలీసులు కనుగొన్నారు.
నికితా కాసాప్ మీద అమెరికా పోలీసులు మొత్తం 9 కేసులను నమోదు చేశారు. రెండు హత్యలు, శవాలను దాచిపెట్టడం, ఆస్తి దొంగతనం, అధ్యక్షుడి హత్యకు కుట్ర, సామూహిక విధ్వంసం, ఆయుధాలను ఉపయోగించడం వంటి నేరాలతో కేస్ ఫైల్ చేశారు. ఈ కుర్రాడికి చాలా రోజుల నుంచి తీవ్రవాద భావజాలం ఉంది. ఈ విషయాన్ని నికితా చాలా మందితో షేర్ కూడా చేసుకున్నాడని చెబుతున్నారు.
today-latest-news-in-telugu | usa | america president donald trump | murder
Also Read: Ukraine: ఉక్రెయిన్ పై రష్యా మరో భారీ దాడి.. 34 మంది మృతి