/rtv/media/media_files/2025/04/06/NBz1hO2tdicfdlYebYo4.jpg)
US revokes all South Sudan visas over failure to repatriate citizens
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సరైన డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా దేశంలో ఉంటున్న వాళ్లని స్వదేశాలకు పంపించేస్తున్నారు. అయితే ఇటీవల అమెరికాకు వచ్చిన ఆఫ్రికన్ పౌరులను కూడా తమ దేశాలకు తిరిగి పంపించారు. కానీ వాళ్లని తీసుకునేందుకు పలు ఆఫ్రికా దేశాలు నిరాకరించాయి. దీంతో ట్రంప్ వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు
అమెరికాకు వెళ్లిన ఆయా దేశాల పౌరులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వాళ్ల వీసాలను ట్రంప్ సర్కార్ రద్దు చేస్తోంది. వలసదారుల చట్టాల అమలును వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో శనివారం తెలిపారు. '' డిపోర్టేషన్ విషయంలో తన ప్రవర్తన మార్చుకొని.. సమస్యను పరిష్కరించే దాకా దక్షిణ సూడాన్‌కు చెందిన వాళ్ల వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేశాం.
Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని
కొత్త వీసాల జారీ ప్రక్రియ నిలిపివేస్తున్నాం. దీనివల్ల అక్కడి పౌరులు ఎవరూ కూడా అమెరికా ప్రవేశించే ఛాన్స్ ఉండదు. దక్షిణ సూడాన్ పాస్‌పోర్ట్‌దారులకు అమెరికాలోని అన్నీ వీసాలకు విలువలేదు. వాళ్లు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ట్రంప్ పాలన విధానానికి దక్షిణ సూడాన్ సహకరించినప్పుడు మాత్రమే ఈ కఠిన నియమాలు సమీక్షిస్తామని'' మార్కో రూబియో తెలిపారు. ఇదిలాఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక దాదాపు 8 వేల మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు వైట్‌హౌస్ తెలిపింది. వీళ్లలో కొందరిని వెనక్కి పంపగా.. మరికొందరు జైళ్లలో ఉన్నారని పేర్కొంది. ఇంకొందరు నిర్బంధ కేంద్రంలో ఉన్నట్లు చెప్పింది.
telugu-news | rtv-news | usa | africa | visa