Trump-Biden: బైడెన్ చేసిన క్షమాభిక్షలు చెల్లవు అంటున్న ట్రంప్!

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తన చివరి రోజుల్లో అనేక మంది నేరస్థులకు క్షమాభిక్ష ప్రసాదించారుతాజాగా ట్రంప్ దీనిపై స్పందించారు. బైడెన్ చేసిన ఈ క్షమాభిక్షలు చెల్లవని ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ఓ షాకింగ్ విషయం తెలిపారు.

New Update
Joe Biden: ఆయన భార్య పేరు మరిచిపోయారు.. ట్రంప్‌పై జో బైడెన్‌ విమర్శలు

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పదవి మరికొంతకాలంలో ముగుస్తుందనగా షాకింగ్ నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వందలాది మంది నేరస్థులకు ఆయన క్షమాభిక్ష ప్రకటించారు. అయితే వాటిని ఇప్పుడు రద్దు చేస్తున్నట్లు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. బైడెన్ అధికారంలో ఉన్న చివరి రోజుల్లో చేసిన క్షమాభిక్షలు చెల్లవన్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన ట్రంప్.. అందుకు గల కారణాలను కూడా చెప్పుకొచ్చారు. 

Also Read: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ అధికారంలో ఉన్న చివరి రోజుల్లో..  1500 మంది నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఒక్క రోజులోనే అంతమందికి క్షమాభిక్ష ప్రకటించి చరిత్రకెక్కిన బైడెన్.. అదేరోజు తన పదవి నుంచి తప్పుకునేలోపు మరింత మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారమే.. 15 రోజుల తర్వాత మరికొంత మందికి శిక్షను మరింత తగ్గించారు. 

Also Read: Robinhood: ఓర్నీ ఇలా కూడా చేస్తారా..? ‘రాబిన్‌హుడ్’ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను నితిన్ ఎలా చెప్పాడో చూశారా?

ఇదంతా జరిగిన మూడు నెలల తర్వాత.. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై స్పందించారు. ముఖ్యంగా బైడెన్ చేసిన ఈ క్షమాభిక్షలు చెల్లవంటూ ప్రకటించారు. ట్రూత్ వేదికగా ఇందుకు సంబంధించి ఓ పోస్టు పెట్టారు. అందులో బైడెన్ నిద్ర మత్తులో రాజకీయ దుండగులకు కూడా క్షమాభిక్షలు ప్రసాదించారని చెప్పుకొచ్చారు. అయితే అవి చెల్లవని, శూన్యం అని.. ఎలాంటి ప్రభావం చూపవని తాను ఇప్పుడు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఎందుకంటే అవన్నీ ఆటోపెన్‌తో చేసినవని చెప్పారు.

సంతకాలు చేయలేదు.....

ఒక విధంగా చెప్పాలంటే.. బైడెన్ వాటిపై సంతకాలు చేయలేదని ట్రంప్ చెప్పారు.. అసలు ఆయనకు ఈ విషయం కూడా తెలియదంటూ వివరించారు. వాటికి అవసరమైన పత్రాల గురించి బైడెన్‌కు వెల్లడించలేదని.. ఆయన ఆమోదించలేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం నడిపిన వారు నేరం చేశారన్నారు. ఆ తర్వాత అదే రాజకీయ దుండగుల అన్‌సెలెక్ట్ కమిటీ.. తనతో సహా అనేక మంది అమాయకులపై రెండేళ్ల పాటు నిర్వహించిన తప్పుడు దర్యాప్తులో సంపాదించిన ఆధారాలను కూడా పూర్తిగా నాశనం చేసిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అయితే ఈ నేరాలకు పాల్పడిన వారు అత్యున్నత స్థాయి దర్యాప్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అర్థం చేసుకోవాలంటూ ట్రంప్ హెచ్చరించారు. 

Also Read: Harsha Sai: హలో మిస్టర్ చీటర్.. నిన్ను కర్మ వెంటాడుతోంది: హర్షసాయిపై మాజీ లవర్ షాకింగ్ పోస్ట్!

Also Read: Tasty Teja - Vishnu Priya: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కేసు నమోదు.. విష్ణుప్రియ, టేస్టీ తేజ ఇక జైలుకే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు