/rtv/media/media_files/2025/02/16/PC6hDZZFSOQIjmC2d5dS.jpg)
Second Batch Flight Landed In Amrithsar
అమెరికా (America) లో అక్రమ వలసదారులుగా ఉన్న భారతీయులు 112 మందితో మరో అమెరికా మిలటరీ విమానం ఆదివారం రాత్రి పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో దిగింది. భారతీయ అక్రమ వలసదారులను అమెరికా బహిష్కరించడం ఇది మూడోసారి. అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వారిని వెనక్కి పంపేందుకు ట్రంప్ యంత్రాంగం చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా ఇదివరకే రెండు విమానాలలో భారత్‌కు చెందిన వలసదారులను పంపించిన విషయం తెలిసిందే.
తాజాగా పంపిన 112 మందితో కలుపుకొని ఇప్పటివరకు మూడు దఫాలుగా 332 మంది అక్రమ వలసదారులను అమెరికా భారత్ (India) కు పంపింది. ఒకవైపు అక్రమ వలసదారులను అమెరికా మిలటరీ విమానంలో అమృత్‌సర్ విమానాశ్రయానికి పంపడంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న 487 మంది భారతీయులను అమెరికా గుర్తించిందని, వారు త్వరలోనే భారత్‌కు చేరుకుంటారని భారత ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
ఇప్పటికే 332 మంది అక్రమ వలసదారులు భారత్‌కు రాగా, మరో 155 మంది అక్రమ వలసదారులను మరోసారి పంపనున్నట్లు సమాచారం.
మళ్లీ అదే తీరు...
సరైన పత్రాలు లేకుండా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అగ్రరాజ్యం తమ సైనిక విమానాల్లో వెనక్కి పంపే విధానాన్ని మాత్రం మార్చుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా అగ్రరాజ్యం పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అక్రమంగా నివసిస్తున్నారనే కారణంతో కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి మరీ విమానాలు ఎక్కిస్తోంది. ప్రయాణం మొత్తం సంకెళ్లతోనే ఉంచినట్టు భారతీయ వలసదారులు చెబుతున్నారు.
సరైన పత్రాలు లేవన్న కారణంగా మొత్తం 228 మంది భారతీయులను ఇప్పటి వరకు అమెరికా వెనక్కి పంపింది. వీరిని తీసుకుని వచ్చిన రెండు విమానాలు శని, ఆదివారాల్లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ల్యాండయ్యాయి. విమానం దిగిన తర్వాతే తమకు వేసిన సంకెళ్లు, గొలుసులు తొలగించినట్టు తెలిపారు. కాగా, తొలి విడతలో ఈ నెల 5న 104 మంది భారతీయులను వెనక్కి పంపినప్పుడు కూడా అమెరికా ఇలాగే సంకెళ్లు వేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
Also Read: Mauritius:మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద్ అరెస్ట్!
ఇక, శనివారం వచ్చిన విమానంలో 116 మంది, ఆదివారం వచ్చిన విమానంలో 112 మంది అక్రమ వలసదారులు ఉన్నారు. శనివారం రాత్రి భారత్ (India) చేరుకున్న వలసదారుల వివరాలను పరిశీలించిన అనంతరం ఆదివారం సాయంత్రం వారిని ఇళ్లకు పంపించారు. ఆదివారం భారత్ చేరుకున్న వారి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
రెండో విడతలో అమెరికా నుంచి వచ్చిన వారిలో ఇద్దరు యువకులు హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. పంజాబ్‌లోని పటియాలా జిల్లా రాజ్‌పురాకు చెందిన సందీప్ సింగ్ అలియాస్ సన్నీ, ప్రదీప్ సింగ్‌లను విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. 2023లో వారిపై హత్య కేసు నమోదైంది.
Also Read: Zelenskyy: వారి సాయం లేకుండా మేం బతకడం కష్టమే.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు