Watch Video: హిందూ మహాసముద్రంలో ఇరాన్‌ చమురు నౌక సీజ్.. వీడియో వైరల్

హిందూ మహాసముద్రంలో ఇరాన్ చమురును అక్రమంగా తరలిస్తోందన్న ఆరోపణతో 'మేజిస్టిక్ ఎక్స్' అనే నౌకను అమెరికా సైన్యం స్వాధీనం చేసుకుంది.  శ్రీలంక, ఇండోనేసియా మధ్య ప్రయాణిస్తున్న ఈ నౌకను సీజ్ చేసింది.

New Update
U.S. military says it seizes another oil tanker associated with Iran

U.S. military says it seizes another oil tanker associated with Iran

అమెరికా, ఇరాన్‌ మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. హిందూ మహాసముద్రంలో ఇరాన్ చమురును అక్రమంగా తరలిస్తోందన్న ఆరోపణతో 'మేజిస్టిక్ ఎక్స్' అనే నౌకను అమెరికా సైన్యం స్వాధీనం చేసుకుంది.  శ్రీలంక, ఇండోనేసియా మధ్య ప్రయాణిస్తున్న ఈ నౌకపైకి అమెరికా దళాలు హెలికాప్టర్ల ద్వారా దిగి సీజ్ చేసిన దృశ్యాలను అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో షేర్ చేసింది. ఇరాన్‌కు సైనిక లేదా ఆర్థిక సాయం అందించే నెట్‌వర్క్‌లను కచ్చితంగా అడ్డుకుంటామని అమెరికా ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

Also read: తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్

ఇటీవల హర్మూజ్ జలసంధి వద్ద తౌస్కా అనే మరో ఇరాన్‌కు చెందిన వాణిజ్య నౌకను కూడా అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ నౌకలో మిస్సైల్స్ తయారీకి వినియోగించే ప్రమాదకర కెమికల్స్ ఉన్నట్లు అమెరికా అనుమామాలు వ్యక్తం చేస్తోంది. అయితే వరుసగా తమ నౌకలను సీజ్ చేయడంపై ఇరాన్ మండిపడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కన పెట్టి తమ వాణిజ్య నౌకలను టార్గెట్ చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వెంటనే తమ నౌకలతో పాటు అందులో ఉన్న సిబ్బందిని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తోంది.

Also Read: అంబులెన్స్‌లో రొమాన్స్.. ఓయో రూమ్‌లా వాడేసుకున్న యువతీ యువకులు..

 అయితే ఈ వరుస ఘటనలు అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం, ఇరుదేశాల మధ్య శాంతి పరిస్థితులపై ఎఫెక్ట్‌ చూపిస్తున్నాయి. హిందూ మహాసముద్రం లాంటి కీలక ప్రాంతాల్లో అమెరికా తన పహారాను కూడా పెంచేసింది. దీంతో కాల్పుల విరమణ కేవలం భూతలానికే పరిమితమైందా అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సముద్ర మార్గాల్లో కూడా ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ పోరు రాబోయే రోజుల్లో ఘర్షణకు దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  

Advertisment
తాజా కథనాలు