/rtv/media/media_files/2026/04/10/trump-and-khameni-2026-04-10-09-51-26.jpg)
Trump Iran war
Trump Iran War : అమెరికా ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి యుద్ధ వాతావరణాన్ని(US Iran war 2026) తలపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య అమలులో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఈ బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒప్పందం కుదరకపోతే మళ్లీ యుద్ధానికి సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్‌తో శాంతి ఒప్పందం(US-Iran Ceasefire Talks) కుదుర్చుకోవాలనేది అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ తన వ్యూహాన్ని కొనసాగిస్తూ, "కాల్పుల విరమణ గడువు ముగిసేలోగా ఒప్పందం కుదరకపోతే, ఇరాన్‌తో తిరిగి యుద్ధానికి వెళ్లడానికి మేం సిద్ధంగా ఉన్నాం" అని ప్రకటించారు. తాము ఇరాన్ కోసం ఒక 'మంచి డీల్' సిద్ధం చేస్తున్నామని, దాని ద్వారానే ఆ ప్రాంతంలో శాంతి, భద్రత, రక్షణ చేకూరుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రపంచ గర్వించేలా ఉంటుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు, పరిస్థితులు దౌత్యపరంగా పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ ప్రతినిధుల మధ్య జరగాల్సిన రెండో దఫా శాంతి చర్చలు అనిశ్చితిలో పడ్డాయి. అమెరికా అమలు చేస్తున్న నావికా దిగ్బంధనం , బెదిరింపుల నీడలో తాము ఎటువంటి చర్చలు జరపబోమని టెహ్రాన్ స్పష్టం చేసింది. ముందుగా అమెరికా తన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, శాంతియుత వాతావరణాన్ని కల్పించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.
ఇరాన్ పట్టుబడుతున్నప్పటికీ, ట్రంప్ సర్కార్ తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం ఖరారయ్యే వరకు పోర్టుల వద్ద నావికా దిగ్బంధనం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ దిగ్బంధనం అమెరికా సాధించిన గొప్ప విజయమని ఆయన పేర్కొన్నారు.
Also Read : హర్మూజ్ జలసంధిలో భారీ స్కామ్.. అధికారుల ముసుగులో కేటుగాళ్లు
ప్రపంచ దేశాల్లో ఆందోళన
గడువు ముగియడానికి సమయం తక్కువగా ఉండటం, ఇరు దేశాలు తమ పట్టు వీడకపోవడంతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయంగా భద్రతా పరమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. బుధవారం నాటికి చర్చల విషయంలో ఏవైనా సానుకూల సంకేతాలు వెలువడతాయా? లేదా యుద్ధం వైపు అడుగులు పడతాయా? అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Also Read : జపాన్‌లో భారీ భూకంపం...సునామీ హెచ్చరికలు... అక్కడ వరుస సునామీలకు కారణం ఏంటంటే?
Follow Us