USA: చైనా డీప్ సీక్ పై అమెరికా ఉక్కుపాదం..ప్రభుత్వ డివైజ్ లలో వద్దంటూ..

డీప్ సీక్ ను కట్టడి చేయడానికి అమెరికా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా డీప్ సీక్ ను ప్రభుత్వ, అధికార డివైజ్ లలో ఇన్ స్టాల్ చేయవద్దని యూఎస్ వాణిజ్య శాఖ తన ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. 

New Update
Deepseek

Deepseek

అత్యంత తక్కువ ఖర్చుతో చైనా రూపొందించిన డీప్ సీక్ ఏఐ టూల్ ఒక ప్రభంజనంలా ప్రపంచంలోకి దూసుకొచ్చింది. ఇది సోషల్ మీడియాతో పాటూ యాపిల్ స్టోర్స్ లోనూ బాగా వెళుతోంది. అమెరికా, యూకే, చైనాలో టాప్‌ ఫ్రీ అప్లికేషన్‌ జాబితాలో ఓపెన్‌ ఏఐని దాటేసింది. అయితే అమెరికా మాత్రం డీప్ సీక్ ను ఎంకరేజ్ చేయొద్దని అనుకుంటోంది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి చెందిన అధికారిక డివైజ్‌లలో ఇన్‌స్టాల్‌ చేయొద్దంటూ యూఎస్‌ వాణిజ్యశాఖ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ డేటా సురక్షితంగా ఉండాలంటే డీప్ సీక్ కు దూరంగా ఉండాలని చెప్పింది. వాణిజ్య శాఖలో ఉన్న డిపార్ట్ మెంట్లు అన్నిటికీ దీనికి సంబంధించి మెయిల్స్ పంపించింది. 

అసలు ఏ రకంగానూ డీప్ సీక్ వాడొద్దు..

ప్రభుత్వం పంపిన ఈ మెయిల్స్ ప్రకారం డీప్‌సీక్‌కు సంబంధించిన అప్లికేషన్‌లు, డెస్క్‌టాప్ యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లను ప్రభుత్వానికి సంబంధించిన డివైజ్‌లలో డౌన్‌లోడ్ చేయడం, చూడడం, కనీసం వాటిని తెరవడం కూడా చేయకూడదని ఆర్డర్ చేసింది. డీప్ సీక్ ను అసలు యాక్సెస్ చేయొద్దని స్ట్రిక్ట రూల్స్ పెట్టింది.  దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికే ఆర్థిక, వాణిజ్య శాఖలకు చెందిన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ నిబంధనలను పాటించాలని చెప్పింది.  అయితే ఈ నిబంధనలు ప్రస్తుతానికేనా...లేకపోతే మొత్తం అసలు ఎన్పటికీ వాడకూడదా అన్నది మాత్రం చెప్పలేదు. ఇందులో టైమ్ బౌండ్ చెప్పకపోయినా..ఇప్పటికైతే కచ్చితంగా పాటించాల్సిందే అని చెప్పిట్టు తెలుస్తోంది. 

ఇక చైనా ఏఐ టూల్ డీప్ సీక్ ను అమెరికాలోని వర్జీనియా, టెక్సాస్, న్యూయార్క్‌తో సహా అనేక రాష్ట్రాలు ప్రభుత్వాలు నిషేధించాయి. డీప్ సీక్ ను ఉపయోగించడం ద్వారా యూజర్లు తమకు తెలియకుండానే సున్నితమైన సమాచారాన్ని చైనా పార్టీలతో పంచుకుంటున్నాయని చెప్పాయి. దీని వలన దేశానికి సంబంధించి సీక్రెట్స అన్నీ చైనా చేతుల్లోకి వె్ళే ప్రమాదం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించి రీసెంట్ గా యూఎస్ సెనేట్ లో కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు దేశ వాణిజ్యశాఖ కూడా నిర్ణయం తీసుకుంది.

Also Read: AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు