/rtv/media/media_files/2025/02/22/dFbXggXqffOJrv92Pkuy.jpg)
Air Traffic For Flights
అమెరికాలో ఆరిజోనాలో మళ్ళీ విమాన ప్రమాదం జరిగింది. ఆరిజోనాలో రెండు చిన్న విమానాలు గాల్లోనే ఢీకొన్నాయి. దీంతో అక్కడ ఆందోళన మొదలైంది. దాదాపుగా రెండు నెలల్లో అమెరికాలో నాలుగు సార్లు ఫ్లైట్ యాక్సిడెంట్లు అయ్యాయి. అన్నింటికంటే జనవరి చివరిలో వాషింగ్టన్ లో జరిగిన ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. ప్రయాణికులు విమానం, ఆర్మీ హెలికాఫ్టర్ ఢీకొట్టుకోవడంతో 67 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది, నలుగురు ఆర్మీ జవాన్లు చనిపోయారు. ఆ తరువాత ఫిలడెల్పియాలో ఒక విమానం ఇళ్ళమీద కూలిపోయింది. మరొక విమానం అలెస్కాలో మిస్ అయి తరువాత యాక్పిడెంట్ కు గురవడంతో అందులో ఉన్న ఏడుగురు మరణించారు. మరో 19 మందికి గాయాలయ్యాయి. ఇప్పుడు ఆరోజోనాలో. దీంతో అమెరికాలో ఆందోళన మొదలైంది. ఎందుకింత తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి అనే ప్రశ్న మొదలైంది.
అసలు విమానాల ట్రాఫిక్ నియంత్రణ ఎలా?
రోడ్డు మీద తిరిగే వాహనాలకు సైన్ బోర్డులుంటాయి. అలాగే ట్రైన్లకు కూడా ట్రాఫిక్ కంట్రోల్, సైన్లు ఉంటాయి. మరి గాల్లో ఎగిరే విమానాలకు ఇవెలా సాధ్యం అంటే...దానికి ఒక టెక్నాలజీ ఉంటుంది అని చెబుతున్నారు. విమానాన్ని నడిపే పైలట్ కు ఎప్పటికప్పుడు ఎయిర్ ట్రాఫిక్ గురించి సమాచారం అందుతూ ఉంటుంది. రేడియో లేదా రాడార్ ద్వారా దీన్ని అందిస్తారు. అలాగే పైలట్‌కు సహాయం చేయడానికి మైదానంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంది, ఇది పైలట్‌కు ఏ దిశలో తిరగాలి మరియు ఎక్కడికి తిరగకూడదు అనే దానిపై ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను ఇస్తూ ఉంటుంది.
హెచ్ఐఎస్...
విమానాలకు ఆకాశంలో మార్గాలుంటాయి. అవి ఎలా పడితే అలా ఎగురవు. పైలెట్లు తమకు ఇచ్చిన లేదా సూచించిన మార్గంలోనే విమానాన్ని నడుపుతారు. ఆకాశంలో దీన్ని కనుగొనడానికి క్షితిజ సమాంతర పరిస్థితి సూచికను ఉపయోగిస్తారు. దీన్నే హెచ్ఐఎస్ అంటారు. ఇది పైలెట్ ముందు స్క్రీన్ మీద ఇన్స్టాల్ చేస్తారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే...ఈ హెచ్ఐఎస్ మన గూగుల్ మ్యాప్ లా ఉంటుంది అన్నమాట. మనకు గూగుల్ మ్యాప్ ఎలా రూట్ చెబుతుందో...ఈ హెచ్ఐఎస్ కూడా అలానే పైలెట్లకు ఎప్పుడు ఏ దిశలో విమానాన్ని తీసుకెళ్ళాలో చెబుతుంది. సాంకేతిక సమస్యల కారణంగా ఈ హెచ్ఐఎస్ పని చేయకపోతే...పైలెట్లకు సమాచారం అందకపోతే ప్రమాదాలు జరుగుతాయి. వాషింగ్టన్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఇలా సమయానికి సమాచారం అందకపోవడం వల్లనే జరిగింది.