/rtv/media/media_files/2025/01/20/4PHVuiZPpEgSdMNeIGpM.jpg)
gaza
ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజా వణికిపోయిన సంగతి తెలిసిందే.మానవతా సాయం అంతంత మాత్రమే అందడంతో..జనాభాలో సగం మంది ఆకలితో అల్లాడిపోతున్నారు.ఎట్టకేలకు గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో అక్కడి పరిస్థితుల్లో కొంత మార్పు కనిపిస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది నిరాశ్రయులు స్వస్థలాల బాటపట్టారు.
Also Read:Maha Kumbh Mela:కుంభమేళాలో తగ్గని ట్రాఫిక్..300 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
పెద్ద ఎత్తున సహాయ సామాగ్రి గాజాలోకి ప్రవేశిస్తోంది. దీంతో స్థానికంగా కవరు దాదాపు తగ్గుముఖం పట్టిందని ఐరాస మానవతావాద విభాగం చీఫ్ టామ్ ప్లెచర్ వెల్లడించారు. శాంతి ఒప్పందం అమలులో అవాంతరాలు ఎదురైతే మాత్రంసమస్య పునరావృతం కావొచ్చని హెచ్చరించారు.
Also Read:Horoscope Today:నేడు ఈ రాశి వారికి వాయిదా పడ్డ పనులన్నీ పూర్తై పోతాయి!
గాజాకు కరవు ముప్పు చాలా వరకు తప్పినట్లే.కాల్పుల విరమణకు ముందునాటితో పోలిస్తే ప్రస్తుతం ఆకలి కేకలు తగ్గుముఖం పట్టాయి. అయితే పరిస్థితులు ఇంకా కుదుట పడాల్సి ఉంది. 20 లక్షలకు పైగా ఉన్న జనాభాకు మరిన్ని ఆహార,వైద్య సరఫరాలు అవసరం.ఆస్పత్రులు, పాఠశాలలు,నివాసాలనే తేడా లేకుండా భవనాలన్నీ నేలమట్టమైన నేపథ్యంలో ..నిరాశ్రయులకు టెంట్ల వంటి తాత్కాలిక ఆవాసాలు అందించాలి.
మళ్లీ కరవు పరిస్థితులు...
కాల్పుల విరమణ ఉల్లంఘనకు గురైతే మాత్రం మళ్లీ కరవు పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుత శాంతి ఒప్పందంఅనేక మందిప్రాణాలను కాపాడింది. హమాస్, ఇజ్రాయెల్ లు దీనికి కట్టుబడి ఉండాలి అని ఓ వార్తాసంస్థతో పేర్కొన్నారు.
ఇటీవల గాజాలో రెండు రోజుల పాటు పర్యటించిన ప్లెచర్ అక్కడి దుస్థితిని వివరించారు.బాంబు దాడులతో గాజా శిథిలాల కుప్పగా మారింది. ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్న ప్రజలు. శిథిలాల్లో తమ వారి మృతదేహాల కోసం అన్వేషణ చేపడుతున్నారు.శవాల కోసం శునకాలూ తచ్చాడుతున్నాయి.
అదంతా ఓ హారర్ సినిమాలా ఉంది.కిలోమీటర్ల మేర ఇదే దుస్థితి.అవన్నీ చూస్తుంటే హృదయం ద్రవించింది అని స్థానిక పరిస్థితులను కళ్లకు కట్టారు.ఇదిలా ఉండగా..గత నెల19న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 12 వేలకు పైగా ట్రక్కులు గాజాలోకి ప్రవేశించినట్లు ఐరాస మానవతా విభాగం వెల్లడించింది.
Also Read:Amit Shah: ఛత్తీస్‌గఢ్‌లో 31 మంది మావోయిస్టులు మృతి.. అమిత్ షా సంచలన ప్రకటన
Also Read:Prashant Bhushan: ఆప్ ఓటమిపై స్పందించిన ప్రశాంత్ భూషణ్.. కేజ్రీవాల్‌పై విమర్శలు