Russia-Ukraine: భీకర యుద్ధం..  రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్ బలగాలు

ఉక్రెయిన్ బలగాలు రష్యాపై విరుచుకుపడ్డాయి. రష్యా ఆధీనంలోని కుర్స్‌‌లోకి ఉక్రెయిన్ బలగాలు ప్రవేశించి దాడులు జరిపాయి. ఈ దాడుల్లో రష్యాకి భారీగా ప్రాణ నష్టం జరిగిందని జెలెన్‌స్కీ తెలిపారు. ఈ భీకర యుద్ధంలో తమదే పై చేయి అని జెలెన్‌స్కీ వెల్లడించారు.

New Update
Zelensky: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ హత్యకు కుట్ర.. వ్యక్తి అరెస్ట్‌!

Volodymyr Zelenskyy

రష్యా, ఉక్రెయిన్ భీకర మళ్లీ మొదలైంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ బలగాలు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. రష్యా ఆధీనంలో ఉన్న కుర్స్‌ అనే ప్రాంతంలోకి ఉక్రెయిన్ బలగాలు ప్రవేశించాయి. అక్కడ మిలటరీ ఆపరేషన్‌ చేపట్టి విజయం సాధించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.

ఇది కూడా చూడండి: HOROSCOPE TODAY: నేడు ఈ రాశివారికి ధనలాభం..ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే

ఇది కూడా చూడండి:  KTR : ఇవాళ ఏసీబీ, రేపు ఈడీ.. కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

రష్యాకి భారీగా ప్రాణ నష్టం జరిగిందని..

కుర్స్‌ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ను ఉక్రెయిన్‌ బలగాలు ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల నుంచి దక్షిణ కుర్స్‌ ప్రాంతంలో దాడులు జరిగాయి. అందులో ఉక్రెయిన్ సైన్యం రష్యాపై విరుచుకుపడటంతో రష్యాకి భారీగా ప్రాణ నష్టం జరిగిందని జెలెన్‌స్కీ తెలిపారు. కుర్స్ ప్రాంతంలో జరుగుతున్న భీకర యుద్ధంలో తమదే పై చేయి అని జెలెన్‌స్కీ వెల్లడించారు. 

ఇది కూడా చూడండి:  కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షలు వాయిదా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Earthquake: గంట వ్యవధిలో నాలుగు భూకంపాలు.. భయాందోళనలో జనం

ఆదివారం ఒకే గంటల వ్యవధిలో భారత్, మయన్మార్, తజికిస్తాన్‌లో నాలుగు భూకంపాలు వచ్చాయి. భారత్‌లో రెండు, మయన్మార్, తజికిస్తాన్‌లో ఒక్కోటి వచ్చాయి. అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు.

New Update
Earthquake

Earthquake

ఈమధ్య వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. ఆదివారం ఒకే గంటల వ్యవధిలో భారత్, మయన్మార్, తజికిస్తాన్‌లో నాలుగు భూకంపాలు వచ్చాయి. దీంతో జనం భయాందోళనలో ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. మొదటి భూకంపం తజికిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు సమీపంలో రాగా.. ఆ తర్వాత మయన్మార్‌లో మీక్టిలాలో వచ్చింది. అనంతరం భారత్‌లోని జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వార్‌లో, ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకశీలో భూకంపాలు వచ్చాయి.   

Also Read: ఈ ఆడోళ్లు మహా డేంజర్.. జుట్టు పట్టుకుని ఎలా కొడుతుందో చూశారా?

అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు. తజికిస్తాన్‌లో భూకంప తీవ్రత 6.0 గా నమోదయ్యింది. భారత్‌లో ఫైజాబాద్‌లో ఉదయం 9 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. కేవలం ఒక గంట వ్యవధిలోనే నాలుగు భూకంపాలు వచ్చాయి. మయన్మార్‌లో 5.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. మార్చి 28న అక్కడ 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మళ్లీ బలమైన భూకంపం సంభవించడం కలకలం రేపింది. జనం ఇళ్ల నుంచి భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. 

Also Read: అర్థరాత్రి ఆలయం తెరవాలంటూ.. పూజారి పై దాడి!

 జమ్ముకశ్మీర్‌లో హిమాలయన్‌ ప్రాంతంలో 4.2 తీవ్రతో భూకంపం రావడంతో అక్కడి స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో 4.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే ఈ భూకంపాల వల్ల ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ భూకంపాలు భారత్‌ ప్లేట్‌ యూరేషియన్ ప్లేట్‌తో ఢీకోనడం వల్ల సంభవించే టెక్టోనిక్‌ కదలికల వల్ల సంభవిస్తున్నాయి. ఇదిలాఉడంగా మార్చి 28న మయన్మార్‌ వచ్చిన భూకంప ధాటికి 3600 మందికి పైగా జనం మృత్యువాత పడ్డారు. 

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

telugu-news | rtv-news | earthquake | national-news

 

Advertisment
Advertisment
Advertisment