/rtv/media/media_files/2025/03/22/03nOaIJ5gIHc505UyfrI.jpg)
Twitter old Logo
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌కు చెందిన పాత ఐకానిక్ లోగో అందరికి గుర్తుండే ఉంటుంది. బ్లూ కలర్‌లో ఓ బుల్లి పిట్ట ఆకారంలో ఉంటుంది. ఆ పిట్టబొమ్మ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. అయితే ఈ పాత ట్విట్టర్ లోగో బ్లూ బర్డ్‌ను వేలంలో వేశారు. దీంతో అది భారీ ధర పలికింది. ఆర్ఆర్ ఆక్షన్ అనే సంస్థ నిర్వహించిన వేలం పాటలో ఈ పిట్ట లోగో 35 వేల డాలర్లకు అమ్ముడైపోయింది.
Also Read: ఇస్తే తీసుకుంటా...అధ్యక్ష పదవిపై బండి సంజయ్ హాట్ కామెంట్స్!
భారత కరెన్సీలో చూసుకుంటే దీని ధర దాదాపు రూ.30 లక్షలకు పైగానే ఉది. అయితే వేలంలో దీన్ని దక్కించుకున్న వ్యక్తి వివరాలు మాత్రం ఆ ఆక్షన్ సంస్థ చెప్పలేదు. ఇదిలాఉండగా.. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ట్విట్టర్ హెడ్‌క్వార్టర్ బిల్డింగ్ గోడపై బ్లూ బర్డ్ ఉండేదన్న సంగతి తెలిసిందే. ఇది 12 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు, 254 కేజీల బరువు ఉండేది. అయితే 2022 అక్టోబర్‌లో ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొన్నారు. ఒక్కో స్టాక్‌కు 54.20 డాలర్ల చొప్పున 44 బిలియన్ డాలర్లు చెల్లించారు.
Also Read: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా JAC మీటింగ్.. సీఎం స్టాలిన్, రేవంత్ ఏమన్నారంటే ?
దీన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత అందులో ఎలాన్ మస్క్ అనేక మార్పులు చేస్తూ వచ్చారు. సంస్థ పేరును ట్విట్టర్ నుంచి ఎక్స్‌గా మార్చారు. అలాగే ట్విట్టర్ పాత లోగో అయిన పిట్ట స్థానంలో ఎక్స్ (X)ను చేర్చారు. అంతేకాదు ఆ సంస్థలో పనిచేసే 75 శాతం మంది ఉద్యోగులను కూడా తొలగించారు. కంటెంట్ విషయంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. అయితే ట్వి్ట్టర్ పాత జ్ఞాపకమైన ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను అమ్మేశారు. అయితే తాజాగా ఆర్ఆర్ ఆక్షన్ అనే సంస్థ నిర్వహించిన వేలం పాటలో ఈ పిట్ట లోగో 35 వేల డాలర్లకు అమ్ముడైపోయింది.
Also Read: భారత్‌లో ఎక్స్ గ్రోక్ తిట్ల వివాదం.. స్పందించిన ఎలాన్ మస్క్
telugu-news | national-news | rtv-news
India-China: ట్రంప్ టారిఫ్ దెబ్బకి మెరుగుపడుతున్న భారత్-చైనా సంబంధాలు
ట్రంప్ టారిఫ్‌ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ వెల్లడించారు.
Jai shankar
ట్రంప్ టారిఫ్‌ల వల్ల స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. కానీ భారత్-చైనా సంబంధాలు మాత్రం బలపడే దిశగా వెళ్తున్నాయి. తాజాగా ఇరుదేశాల సంబంధాలపై విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఆ సంబంధాలు సానుకూల దిశ వైపు పయనిస్తున్నాయన్నారు. గతంతో పోలిస్తే ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని.. వీటిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ఎంతో కృషి చేయాల్సి ఉందని అన్నారు.
Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్
ఇదిలాఉండగా 202-0 లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత్-చైనా మధ్య సంబంధాలు దిగజారిపోయాయి. అనంతరం సైనిక, దౌత్యపరంగా చర్చలు జరగడం, గస్తీ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇరుదేశాలకు స్వేచ్ఛగా వెళ్లొచ్చు .
Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్
ఇటీవల చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 108 శాతం టారిఫ్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా చైనా కూడా అమెరికాపై 84 శాతం సుంకాలు విధించింది. దీంతో ట్రేడ్ వార్ మరింత ముదిరింది. ఇదిలాఉండగా.. న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ అధికార ప్రతినిధి యూ జింగ్ టారిఫ్‌ల స్పందించారు. అమెరికా టారిఫ్ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, చైనా జత కట్టాలన్నారు. పరస్పర సహకారం, ప్రయోజనాలపై ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్యం సంబంధాలు ఆధాపడి ఉన్నాయన్నారు. అమెరికా విధించిన టారిఫ్‌ల వల్ల అనేక దేశాలు, ముఖ్యంగా పేద దేశాలు అభివృద్ధి పొందే హక్కును కోల్పోతున్నాయని చెప్పారు. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన ఇరు దేశాలు కలిసి ఎదుర్కోవాలన్నారు.
Also read: Viral video: రన్నింగ్ ట్రైన్ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్
telugu-news | rtv-news
Urvashi Rautela: దబిడి దిబిడి భామకు గోల్డెన్ క్వీన్ అవార్డు..
BIG BREKING: రాజమండ్రిలో RGVపై మరో పోలీస్ కేసు..!
GT Vs RR: గుజరాత్ తొలి ఇన్నింగ్స్ పూర్తి.. రాజస్తాన్ టార్గెంట్ ఎంతంటే?
Ladies Hostels : అర్థరాత్రి దొంగ హల్ చల్ లేడీస్ హాస్టళ్లలోకి చొరబడి...
Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?