Isreal:ఇజ్రాయెల్‌ మాకు చెప్పే చేసింది: వైట్‌ హౌస్‌!

ఈ భీకర దాడులకు ముందు నెతన్యాహు ప్రభుత్వం అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఈ విషయాన్ని తాజాగా యూఎస్‌ అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌ వెల్లడించింది.

New Update
israel

israel

 

ఇజ్రాయెల్‌-హమాస్‌ ల మధ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. గాజా పై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించడంతో కనీసం 200 మంది వరకు మృతి చెందారని తెలుస్తోంది. అయితే ఈ భీకర దాడులకు ముందు నెతన్యాహు ప్రభుత్వం అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఈ విషయాన్ని తాజాగా యూఎస్‌ అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌ వెల్లడించింది.

Also Read: Viral Video: నీ ఫోన్‌ నీకు కావాలంటే..నాకు కావాల్సింది ఇచ్చేయ్‌!

దాడుల గురించి ట్రంప్‌ యంత్రాంగాన్ని, వైట్‌ హౌస్‌ ను ఇజ్రాయెల్‌ సంప్రదించింది. ఇజ్రాయెల్‌ తో పాటు అమెరికాను భయభ్రాంతులకు గురి చేయాలని చూసే హమాస్‌, హూతీలు, ఇరాన్‌ మూల్యం చెల్లించుకోకతప్పదు. ఇప్పటికే ఇదే విషయాన్ని ట్రంప్‌ స్పష్టం చేశారని వైట్‌ హౌస్‌ మీడియా కార్యదర్శి కరోలిన్‌ లివిట్‌ వెల్లడించారు.

Also Read: Trump: బైడెన్ పిల్లలకు సీక్రెట్‌ సర్వీస్ రక్షణను తొలగించిన ట్రంప్‌!

ఓ వైపు ఇజ్రాయెల్‌ -హమాస్‌ కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపు పై చర్చలకు సిద్ధమవుతుండగా..గాజా పై టెల్‌ అవీవ్‌ వైమానికి దాడులతో విరుచుపడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ ఏకపక్షంగా ఉల్లంఘించిందని, బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని ఈ ఘటన పై హమాస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.కొద్ది రోజుల క్రితం హమాస్‌ కు ట్రంప్‌ హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. 

ఆ సంస్థ చెరలో ఉన్న మిగిలిన బందీలను విడుదల చేయకుంటే గాజా ను మరింత నాశనం చేస్తానని బెదిరించారు. మీ వద్ద బందీలుగా ఉన్న వారందరినీ కూడా వెంటనే విడుదల చేయాలి.చనిపోయిన వారి మృతదేహాలను తిరిగివ్వాలి.లేకుంటే తగిన ఫలితాన్ని అనుభవించకతప్పదు. అందుకు ఇజ్రాయెల్‌కు కావాల్సిన ప్రతిదాన్ని పంపుతాను. నేను చెప్పినట్లు చేయకపోతే హమాస్‌ కు చెందిన ఒక్క వ్యక్తి కూడా క్షేమంగా ఉండడు.

మీ చెరలో బందీలుగా ఉండి విడుదలైన వారిని నేను కలిశాను.ఇదే మీకు చివరి హెచ్చరిక. గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు వేచి చూస్తోంది.మీరు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టండి అని ట్రంప్‌ హెచ్చరించారు. అయితే ఆ హెచ్చరికలను హమాస్‌ పట్టించుకోలేదు. కాల్పుల విరమణ ఒప్పందం నుంచి ట్రంప్‌, నెతన్యాహు వెనక్కి తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. రెండో దశ పై చర్చలు జరపాలని డిమాండ్‌ చేసింది.

తాము విడుదల చేస్తోన్న బందీలకు బదులుగా ఎక్కువ సంఖ్యలో పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో తాజా దాడులు చోటు చేసుకున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్‌ అంగీకరించని కారణంగానే దాడులకు ఆదేశించినట్లు నెతన్యాహు తెలిపారు.

మా బందీలను విడుదల చేయడానికి హమాస్ పదేపదే నిరాకరిస్తోంది. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్‌ కాఫ్‌ ప్రతిపాదించిన కాల్పుల ఒప్పందం కొనసాగింపును తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే దాడులకు ఆదేశించాం. యుద్ద లక్ష్యాలను సాధించడానికి గాజాలోని హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్‌ దాడులు చేస్తోందని వెల్లడించారు. 

Also Read: America: అమెరికా దాటి వెళ్లకండి... హెచ్-1బీ వీసాదారులకు హెచ్చరికలు!

Also Read: Sunita Wiiliams: పట్టుదలకు చిరునామా, యువతకు స్ఫూర్తి సునీతా విలియమ్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు