/rtv/media/media_files/2025/01/22/TCUTm10W3mt5Zc1nkVOm.jpg)
Trump Warns Putin
Trump Warns Putin: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. వచ్చిరాగానే ఆయన పలు సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే జన్మతః హక్కు పౌరసత్వం రద్దు, సరిహద్దులో ఎమర్జెన్సీ ప్రకటించడం లాంటి పలు కీలకమైన ఎగ్జిక్యూటీవ్ ఆర్టర్స్‌పై సంతకాలు చేశారు. అయితే ఇప్పుడు ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వార్నింగ్ ఇచ్చారు. శాంతి ఒప్పంద చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ చర్చలకు రష్యా రాకుంటే రష్యాపై మరిన్న ఆంక్షలు తప్పవని హెచ్చరించారు.
Also Read: యూపీఎస్సీ సివిల్స్ 2025 నోటిఫికేషన్ రిలీజ్.. అప్లికేషన్, అర్హత వివరాలివే!
పుతిన్‌కు ట్రంప్ వార్నింగ్..
ఇంతకుముందు తాను అధ్యక్షుడిగా ఉన్నట్లైతే ఉక్రెయిన్‌లో ఇలా సంక్షోభం వచ్చి ఉండేది కాదని అన్నారు. అయితే ట్రంప్ ఇచ్చిన వార్నింగ్‌పై రష్యా ఇంతవరకు స్పందించలేదు. మరి పుతిన్ దీనికి ఏ విధంగా స్పందిస్తారో అనేది ఆసక్తిగా మారింది. తాను అధ్యక్షుడిని అయితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో యుద్ధం ఆపేందుకు శాంతి చర్చలకు రావాలని రష్యాకు పిలుపునిచ్చారు. గత మూడేళ్లుగా జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి మరి తెరపడుతుందా ? లేదా ? అనేది ఆసక్తికరంగా మారింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్..
— RTV (@RTVnewsnetwork) January 22, 2025
శాంతి ఒప్పందం చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామన్న ట్రంప్..
చర్చలకు రాకుంటే రష్యాపై మరిన్ని ఆంక్షలు తప్ప వని వార్నింగ్..
తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్‌లో సంక్షోభం వచ్చేది కాదని… pic.twitter.com/XgS3MFBYLm
Also Read: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. సాధ్యమవ్వడం కష్టమే!
ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇప్పటిదాకా 12 వేల మందికి పైగా చనిపోయారు. మరో 28 వేల మందికిపైగా గాయాలపాలయ్యారు. ఎప్పుడు, ఎక్కడ, ఏ క్షణం క్షిపణి దాడి జరుగుతుందోనని ఇరుదేశాల ప్రజలు భయాందోళనలో బతుకుతున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని ఆపాలని సూచనలు చేశాయి. అయినప్పటికీ రష్యా, ఉక్రెయిన్ మాత్రం తగ్గడం లేదు. పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చినా కూడా యుద్ధం మాత్రం ఇంకా సుదీర్ఘంగా సాగుతూనే ఉంది. ట్రంప్ రాకతోనైనా.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందా ? లేదా ? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read : Rajasthanలో విషాదం.. అంబులెన్స్ తలుపు ఓపెన్ కాకపోవడంతో మహిళ మృతి