Donald Trump: ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తాం.. మరో బాంబు పేల్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారంలోగా ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే మళ్లీ బాంబులు వేస్తామంటూ హెచ్చరించారు.

New Update
Trump

Trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారంలోగా ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే మళ్లీ బాంబులు వేస్తామంటూ హెచ్చరించారు. ఆరిజోనాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 21తో ఈ గడువు ముగియనుంది. ఈ గడువు ముగిసేలోపే ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలు యత్నిస్తున్నాయి. 

ఇందులో భాగంగానే ఇస్లామాబాద్‌ వేదికగా అమెరికా-ఇరాన్(iran us war) మధ్య సోమవారం మళ్లీ చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజాగా ఈ అల్టిమేటం జారీ చేశారు. బుధవారంలోగా ఒప్పందం చేసుకోవాలని.. లేకపోతే 21వ తేదీ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం పొడగింపు ఉండకపోవచ్చని తెలిపారు. ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్‌ నౌకలపై తమ దిగ్బంధనం కొనసాగుతుందని తెలిపారు. 

Also Read: హర్మూజ్‌ను మళ్లీ మూసేస్తాం.. ఇరాన్‌ సంచలన వార్నింగ్‌

Trump Threatens Bombing On Iran

మరోవైపు ఇరాన్‌తో కలిసి అక్కడి అణుకేంద్రాల నుంచి రిఫైన్ చేసిన యూరేనియాన్ని బయటికి తీస్తామని ట్రంప్ తెలిపారు. యూరేనియం కోసం తవ్వకాలు కూడా చేపడతామని.. కానీ దీనికి భారీగా సామగ్రి కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీన్ని త్వరలోనే అమెరికా భూభాగంలోకి తీసుకెళ్తామని చెప్పారు. అణ్వాయుధాన్ని వదిలేస్తామని ఇరాన్‌ తమకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అంతేకాదు శుద్ధి చేసిన యురేనియం నిల్వలు అప్పగించేందుకు కూడా ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. కానీ ఇరాన్ వీటిని ఖండించింది. తమ దేశంలోని శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎక్కడికీ తరలించమని అక్కడి విదేశాంగ శాఖ తెలిపింది.  

నాటో దేశాలపై కూడా ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఈ కూటమి అసమర్థంగా వ్యవహరించిందని తీవ్రంగా విమర్శలు చేశారు. ఇకనుంచి నాటో సాయం తమకు అవసరం లేదని తేల్చిచెప్పారు. ఇటీవల ఏదైనా సాయం కావాలా అని నాటో నుంచి ఫోన్ వచ్చిందన్నారు. రెండు నెలల క్రితం మీ సాయం అవసరం ఉండేదని కానీ ఇప్పుడు లేదని వాళ్లతో చెప్పినట్లు పేర్కొన్నారు. 

Also Read: సంచలన అప్‌డేట్.. హర్మూజ్‌ జలసంధిని తెరిచిన ఇరాన్

Advertisment
తాజా కథనాలు