/rtv/media/media_files/2025/03/31/JPOhNB37RX0Qo4fxFJ7n.jpg)
Trump
ఇప్పటికీ ప్రతీకార సుంకాలతో వాయగొడుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇప్పుడు ఆయన మరో బాంబ్ పేల్చారు. ఫార్మాస్యూటికల్స్, సెమీ కండక్టర్లపైన కూడా సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ఆ సుంకాలు మునుపెన్నడూ ఎరుగని స్థాయిలో ఉంటాయనే సంకేతాలిచ్చారు. బుధవారం ప్రకటించిన సుంకాల్లో ఈరెండూ లేవు. దాంతో హమ్మయ్య అనుకున్నారు అంతా. కానీ గురువారం ప్రత్యేకంగా వీటి మీద కూడా ఉంటాయని చెప్పారు. దాంతో ఫార్మా షేర్లు ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బ తినడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్ కుదేలయిపోయింది. సెన్సెక్స్ 930 పాయింట్లు, నిఫ్టీ 345 పాయింట్ల మేర పతనమయ్యాయి. ముఖ్యంగా ఫార్మా రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. భారత షేర్ మార్కెట్ ఒక్కటే కాదు అటు అమెరికా, ఆసియా మార్కెట్ల పరిస్థితి కూడా ఇదే.
2020 తర్వాత ఇంతలా..
అమెరికా స్టాక్ మార్కెట్ వరుసగా రెండవ రోజు బాగా పడిపోయింది. డౌ జోన్స్ ఇండెక్స్ దాదాపు 2,231.07 పాయింట్లు లేదా 5.50% తగ్గి 38,314 వద్ద ముగిసింది. ఒక రోజు ముందు కూడా ఇది 3.98% తగ్గింది. అంటే రెండు రోజుల్లో డౌ జోన్స్ 9% కంటే ఎక్కువ పడిపోయింది. ఆసియా మార్కెట్లు కూడా భారీ నష్టాన్ని చవిచూశాయి. 2020 కోవిడ్ ఇయర్ తర్వాత మార్కెట్లు ఇంతలా పడిపోవడం ఇదేనని చెబుతున్నారు. దీంతో టాప్-500 ప్రపంచ కుబేరుల సంపద 208 బిలియన్ డాలర్లు.. అంటే దాదాపుగా రూ.17.8 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, జుకెర్‌బెర్గ్, అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ లాంటి వాళ్ళఉ ఈ లిస్ట్ లో ఉన్నారు.
ప్రపంచ ఆర్థిక వృద్ధిపై..
ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు కూడా భారీగా పతనమవుతున్నాయి. తాజాగా అయితే చమురు ధరలు 5 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఏప్రిల్ 3వ తేదీన బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 8 శాతం వరకు క్షీణించి 70 డాలర్ల కంటే తక్కువకు చేరింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్‌లో క్రూడాయిల్ ధర కూడా భారీగా తగ్గింది. 8 శాతం వరకు తగ్గి 65.62 డాలర్లకు చేరుకుంది. వీటివల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధిపై తీవ్రంగా ప్రభావం పడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
today-latest-news-in-telugu | trump tariffs | usa | stock-market