USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపి, శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలుపెరుగకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చించిన ఆయన ఈరోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో చర్చలు జరిపారు.

New Update
trump

putin, zelensky, Trump

 రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా గట్టిగా డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఇరు దేశాల అధ్యక్షులతో వరుసగా ఫోన్ కాల్స్ లో చర్చలు జరుపుతున్నారు. నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సుదీర్ఘ చర్చలు జరిపిన ట్రంప్ సీజ్ ఫైర్ గురించి మాట్లాడారు. దీనిపై శాంతి ఒప్పందానికి రష్యా రెడీగా ఉందని చెప్పారు.  ఈరోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ఫోన్ కాల్ చర్చలు జరిపారు. శాంతి ఒప్పందానికి ఇరు దేశాల అభ్యర్ధనలను విన్నారు.  త్వరలోనే చర్చలను ఒక కొలిక్కి తీసుకువస్తానని...వివరాలను చెబుతానని ట్రంప్ తెలిపారు. 

త్వరలోనే వివరాలు..

దాదాపు గంటపాటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో చర్చలు జరిపానని ట్రంప్ చెప్పారు. నిన్న పుతిన్ తో జరిగిన చర్చలపైనే ఎక్కువ సేపు డిస్కస్ చేశామని అన్నారు. శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అభ్యర్థనలు, అవసరాలను తెలుసుకున్నామని చెప్పారు. చర్చలకు సంబంధించి వివరాలను రూపొందించాలని విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్‌ వాల్జ్‌లను ఆదేశిస్తా. త్వరలోనే ఈ వివరాలు వెల్లడిస్తామని...ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ లో చెప్పారు. 

usa
Trump Post

Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్‌ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!

 

అంతకు ముందు రష్యా, ఉక్రెయిన్ ల యుద్ధం గురించి జెలెన్ స్కీ మాట్లాడారు. ఉక్రెయిన్‌ ఇంధన, మౌలిక సదుపాయాలపై నెల రోజులు పాటు దాడులు నిలిపివేసేలా యూఎస్, మాస్కోల మధ్య అంగీకారం కుదిరింది. అయినా కూడా రష్యా తమపై దాడులు చేస్తూనే ఉందని ఆయన ఆరోపించారు. ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘించిందని అన్నారు. నిజంగా రష్యా ఏం కోరుకుంటుందనేదీ ఈ దాడులతో తెలిసిపోతుంది. దాదాపు 40 డ్రోన్లు మా భూభాగాన్ని తాకాయి. దురదృష్టవశాత్తూ పౌరుల మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. దీని ద్వారా రష్యా ఏం కోరుకుంటోంది అనేది స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. 

Also Read: HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు