/rtv/media/media_files/2025/08/18/trump-and-putin-2025-08-18-20-55-47.jpg)
At least seven killed as Russian air strikes on Ukraine continue right before Trump-Zelenskyy talks
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. దీని కోసం గాజా శాంతి ప్రణాళిక లాంటి దాన్ని ఒకటి తయారు చేశారు. 28 మంది సూత్రాలతో దీన్ని రూపొందించారు. ఈ ప్రనాళిను వారం రోజులుగా ఒప్పుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కు టైమ్ కూడా ఇచ్చారు. కీవ్ వారం రోజుల్లోగా శాంతి ప్రనాళికను అంగీకరించాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అలా ఒప్పుకోకపోతే..జీవితాంతం వాళ్ళు పోరాడాల్సిందేనని అన్నారు. అయితే ఈ శాంతి ప్రనాళికను ట్రంప్ రష్యాకు అనుకూలంగా ఉందని చెబుతున్నారు. ఇందులో రష్యా ఆశిస్తున్న భూబాగాన్ని కీవ్ వదులుకోవాలని, తన సైన్యాన్ని పరిమితం చేయాలని, యుద్ధాన్ని ముగించడంతో నాటోలో చేరకుండా కట్టుబడి ఉండాలని సూతరాలను రాశారు.
అవసరమైతే మిత్రులనే వదులుకుంటాం..జెలెన్ స్కీ..
అయితే శాంతి ప్రనాళిక విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. అననీ రష్యాకు అనుకూలంగా ఉండడంతో దీనికి అంగీకరించకూడదని ఆయన అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే అమెరికాతో స్నేహాన్ని కూడా వదులుకుంటామని పరోక్షంగా హెచ్చరించారు. ప్రస్తుతం తమ దేశం చరిత్రలోనే అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోంటోందని జెలెన్ అన్నారు. ఉక్రెయిన్ తన ఆత్మగౌరవాన్ని కోల్పోవడమా..? కీలకమైన భాగస్వామిని వదులుకోవడమా అనే దాన్ని ఎంచుకునే పరిస్థితి ఉందని చెప్పారు. ఉక్రెయిన్ ప్రయోజనాల మేరకే తమ నిర్ణయాలు తీసుకుంటామని..దాని కోసం అవసరమైతే మిత్రులను వదులుకుంటామని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రణాళికకు సంబంధించి ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తామని జెలెన్ స్కీ తెలిపారు. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో కూడా చర్చలు జరిపారు. యుద్ధాన్ని ాపేయాలని మాకు కూడా ఉందని..ట్రంప్ ఆకాంక్షను కూడా గౌరవిస్తున్నామని అన్నారు. దీని కోసం త్వరలోనే అమెరికా అధ్యక్సుడితో భేటీ అవుతానని చెప్పారు.
ఉక్రెయిన్ కు ఇంకో ఆప్షన్ లేదు..పుతిన్
మరోవైపు ట్రంప్ ప్రనాళికపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుకూలంగా స్పందించారు. ఉక్రెయిన్ దీనికి అంగీకరించాల్సిందేనని అన్నారు. వారు ఇప్పటికీ భ్రమలో ఉన్నారని...తమను జయించగలరని ఉక్రెయిన్, నాటో దేశాలు కలలు కంటున్నారని విమర్శించారు. యుద్ధం ముగింపుకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ తెలిపారు. ఈ ప్రణాళికపై వివరణాత్మక చర్చకు అంగీకరిస్తున్నామని.. అది జరగకపోతే యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు.
Also Read: Bihar: నితీశ్ సర్కార్ లో బిగ్ ఛేంజ్..కీలక శాఖను వదులుకున్న జేడీయూ
Follow Us