Trump: ట్రంప్ నిర్ణయాలు.. భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం..!

ట్రంప్ సంచలన నిర్ణయాలతో అమెరికా దూసుకెళ్తోంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలోని భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపనుంది.

New Update
Trump

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు, ఉత్తర్వులతో ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో.. ఏ దేశంపై పిడుగు లాంటి వార్తను పడేస్తారోనని తీవ్రంగా భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటగా.. అమెరికాలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపి.. వారిని స్వదేశాలకు పంపిన ట్రంప్.. వలసదారులకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేశారు. 

Also Read: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!

ఈ నేపథ్యంలోనే అమెరికాలో చదువు కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం వెళ్లిన విదేశీయులు ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని తీవ్ర భయాందోళనలో మునిగిపోయారు. విద్య, ఉద్యోగాలు, వాణిజ్య పరంగా అమెరికాతో సంబంధం ఉన్న దేశాలు మొత్తం ఇప్పుడు.. ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. దాని వల్ల తాము ఏం ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందోనని అనుక్షణం ఆందోళన చెందుతున్నారు. ఇక ఇందులో భారతీయులు కూడా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

Also Read:  USA: ఎక్కడికీ వెళ్లొద్దు..అమెరికాలో టెకీలకు కంపెనీలు వార్నింగ్

ట్రంప్ పరిపాలనలో ఇమ్మిగ్రేషన్ రూల్స్‌ను మరింత కఠినతరం చేయడం, విద్యా శాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టడం చేశారు. పాఠశాలల్లో కూడా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలు పెరగడంతో.. విద్యార్థులు, వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తెలుగు విద్యార్థులు, ముఖ్యంగా ఎఫ్ 1 వీసాలపై అమెరికాలో చదువుతున్న వారు.. వీసా నిబంధనలు కఠినతరం కావడం వల్ల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. 

2023లో 7 వేల మంది భారతీయ విద్యార్థులు వీసా గడువు మించిపోయిన తర్వాత కూడా అక్కడే ఉంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.మరోవైపు.. విద్యా శాఖకు సంబంధించి ట్రంప్ తీసుకోనున్న కొత్త నిర్ణయాలతో విద్యార్థులకు అందే ఆర్థిక సహాయంపైనా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తెలుగు విద్యార్థుల్లో చాలామంది స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) కోర్సుల్లో ఎక్కువగా చేరుతారు. కొత్త విధానాలు వస్తే ఈ స్టెమ్ విద్యార్థులకు ఆర్థిక భారం పెరిగే ప్రమాదం ఉంది. అయితే స్థానిక నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో విద్యా అవకాశాలు మెరుగుపడే అవకాశం కూడా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ తరచూ చెప్పే అమెరికా ఫస్ట్ విధానం కారణంగా అమెరికా ప్రభుత్వం హెచ్ 1బీ వీసాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇది తెలుగు ఐటీ నిపుణులకు పెద్ద సవాలుగా మారింది. వీసా ఆమోద ప్రక్రియలు కఠినతరం కావడం, సిబ్బంది సంస్థలపై నిషేధం వంటి చర్యలతో అమెరికాలో విదేశీయులకు ఉద్యోగ అవకాశాలను పరిమితం చేస్తున్నాయి. టెక్ రంగంలో పనిచేసే తెలుగు వారు, ముఖ్యంగా టెక్సాస్, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో నివసించేవారు ఈ హెచ్ 1బీ వీసా మార్పుల వల్ల ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

Also Read: AP: హైకోర్ట్ లో ఆర్జీవీకి ఊరట..తొందరపాటు చర్యలు వద్దు

Also Read: Kodali Nani: మరో నెల రోజులపాటు ముంబైలోనే కొడాలి నాని.. టెన్షన్‌లో అభిమానులు!

trump | america | jobs | students | Donald Trump On H1B Visa | Donald Trump sensational comments on H1B | Donald Trump Big Decision On H1B Visa | donald trump big shock to indians over h1b visa | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

అగ్రరాజ్యం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. టారీఫ్ లకు సంబంధించి ట్రంప్ సర్కార్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. చైనా మినహా మిగతా అన్ని దేశాలపైనా టారీఫ్ లను 90 రోజుల పాటూ నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

New Update
Donald Trump

Donald Trump

మొత్తానికి అమరికా ప్రభుత్వం దిగొచ్చింది. టారీఫ్ లపై ఇంచుమించు అన్ని దేశాలూ వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడంతో వెనక్కు తగ్గడమే మంచిది అనుకున్నట్టుంది. మొత్తానికి టారీఫ్ లపై కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఊరట కలిగించింది. దాదాపు వార రోజుల పాటూ ట్రంప్ టారీఫ్ లతో బెంబేలెత్తిపోయిన ప్రపంచం ఇప్పుడు కాస్త శాంతిస్తుంది. అమెరికా అధ్యక్షుడు మొదలెట్టిన ఈ వాణిజ్య యుద్ధంతో ప్రపంచ మార్కెట్ అంతా అతలాకుతలం అయిపోయింది. షేర్ మార్కెట్ అయితే ఎన్నడూ చూడని విధంగా నష్టాలను చూసింది.  ఇప్పుడు ఈ 90 రోజుల నిలుపుదలతో అందరూ కాస్త ఊరట చెందుతారు.

చైనాకు మాత్రం లేదు..

అయితే ఈ 90 రోజుల నిలుపుదల చైనాకు మాత్రం వర్తించదని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య మరింత ముదిరినట్టయింది.  ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాపై యూఎస్ సుకాలు పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఒక్కరోజు తేడాలోనే చైనాపై యూఎస్‌ మరోసారి సుంకాలు పెంచింది. 104 నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. చైనా కూడ తగ్గేదే లే అన్నట్టు ప్రవర్తిస్తోంది. అంతకుముందు అమెరికాకు ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా వస్తువులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి డ్రాగన్‌పై సుంకాలు 125శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. 

today-latest-news-in-telugu | usa | donald trump tariffs

Also Read: GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

Advertisment
Advertisment
Advertisment