/rtv/media/media_files/2026/04/15/trump-2026-04-15-13-45-40.jpg)
Trump rules out ceasefire extension, prefers deal with Iran to end war
పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పే దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి పొడిగించే ఉద్దేశం తమకు లేదని తేల్చిచెప్పారు స్పష్టం చేశారు. శాశ్వత పరిష్కారం కోసం ఒప్పందం వైపే తాము మొగ్గు చూపుతున్నామని పేర్కొన్నారు. ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఒకవేళ ఇరాన్‌తో చర్చలు సక్సెస్ అయి ఒప్పందం కుదిరితే ప్రపంచ దేశాలకు ఇది మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు.
Also Read: ఇరాన్‌తో మళ్లీ చర్చలు.. కానీ రెండు షరతులు విధించిన అమెరికా
ఓ ఇస్లామాబాద్ వేదికగా మరో రెండ్రోజుల్లో రెండో దఫా చర్చలు ఉంటాయని ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ శాంతి చర్చలు సఫలం అయితే పశ్చిమాసియాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న యుద్ధాలకు ముగింపు పడే అవకాశం ఉంది. ఇదిలాఉండగా అమెరికా-ఇరాన్ మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న తాత్కాలిక కాల్పుల ఒప్పందం గడువు ఏప్రిల్ 21తో ముగియనుంది. ఈ గడువు ముగిసేలోపు తుది నిర్ణయానికి రావాలని ట్రంప్ భావిస్తున్నారు.
Also Read: అరుణాచల్‌ప్రదేశ్ పేరు మార్చిన చైనా.. భూభాగం మాదే అంటూ బలుపు మాటలు
అందుకే రెండో విడత సమావేశంపై ట్రంప్ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. రాబోయే రెండ్రోజులు అద్భుతంగా ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాదు ఇరాన్ రాజకీయాల్లో వచ్చిన మార్పులపై కూడా సానుకూలంగా స్పందించారు. గతంలో ఉన్న అతివాద శక్తుల ప్రభావం తగ్గి.. అక్కడ కొత్త పాలన మొదలైందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు కొత్త పాలకులతో కలిసి తాము పనిచేసేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వీళ్ల నాయకత్వంలో చర్చలు ఫలించి పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Follow Us