BIG BREAKING: అమెరికన్లకు ట్రంప్ అదిరిపోయే శుభవార్త.. ఆదాయపు పన్ను రద్దు!

అమెరికా పౌరులకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించేలా ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదనలు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
Donald Trump

Donald Trump

అమెరికా పౌరులకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించేలా ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదనలు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రజలను ధనవంతులు చేసే వ్యవస్థ పునరుద్ధరణ దిశగా ఈ చర్య ఉపయోగపడుతుందని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు.

Also Read: America: కాళ్లూ, చేతులు కట్టేసి.. నీళ్లు కూడా ఇవ్వకుండా.. అక్రమవలసదారుపై అమెరికా వికృత చేష్టలు!

ప్రస్తుతం అమెరికాప్రభుత్వానికిలభించే ఆదాయంలో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి వచ్చే మొత్తం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది.ట్రంప్‌ నిర్ణయంతో ఆ మేరకు కోతపడితే..దానిని భర్తీ చేసుకొనేందుకు దిగుమతి సుంకాలను వాడుకోవాలన్నది ప్రణాళికగా చెబుతున్నారు.

Also Read: Telangana: సరస్వతి పుష్కరాలు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి.. ఎప్పుడు, ఎక్కడ..అంటే

అమెరికన్లను ధనవంతులు, మరింత శక్తిమంతులుగా చేసే వ్యవస్థలోకి మనం వెళ్తున్నాం. ఇతర దేశాలను సుసంపన్నం చేసేందుకు మన వారి పై పన్నులు వేసే బదులు..మనమే విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లను సంపన్నులు చేయాలి. వీటిని వసూలు చేసేందుకు ఎక్స్‌టర్నల్‌ రెవెన్యూ సర్వీసును ప్రారంభించాను అని రిపబ్లికన్‌ సభ్యుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

అమెరికా చరిత్రలోనే 1870 నుంచి 1913 మధ్య ప్రజలు అత్యధిక సంపదతో ఉంటారని ట్రంప్‌ పేర్కొన్నారు. నాడు సుంకాల ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉండేదని చెప్పారు. అప్పట్లో దిగుమతి సుంకాల నుంచి ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆదాయం లభించేందన్నారు. అమెరికా తక్షణమే తన వాణిజ్య వ్యవస్థను మార్చుకోవాలన్నారు.

అమెరికా ఉద్యోగులు, కుటుంబాలను రక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారత్‌ , చైనా, బ్రెజిల్‌ పై అత్యధిక పన్నులు విధిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. బయట దేశాలు ఏం చేస్తున్నాయో చూడండి. చైనా భారీగా పన్నులు వసూలు చేస్తుంది. ఇక భారత్‌, బ్రెజిల్‌, ఇతర దేశాలు కూడా ఆ పద్ధతినే పాటిస్తున్నాయి. మనం ఇలా జరగనీయకూడదు.

అమెరికా ప్రయోజనాలు అన్నింటికంటే ముందుండాలి అని అన్నారు.వాస్తవానికి ట్రంప్‌ గత డిసెంబర్‌ లోనే బ్రిక్స్‌ దేశాలు ప్రత్యేక కరెన్సీ తీసుకొస్తే 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరించారు.డాలర్‌ వినియోగం నిలిపేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 

Also Read: Collector: రిపబ్లిక్ వేడుకల్లో డ్యాన్స్ తో దుమ్మురేపిన కృష్ణా జిల్లా కలెక్టర్ దంపతులు.. వీడియోలు వైరల్!

Also Read: Hyderabad: మీర్‌పేట్ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు... ఆ సినిమా ప్రేరణతోనే హత్య!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: అమెరికాకు సుంకాల దెబ్బ..ధరల పెరుగుతాయని స్టోర్లకు పరుగెడుతున్న జనాలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు ప్రపంచ మొత్తంతో పాటూ సొంత దేశ ప్రజలను కూడా భయపెడుతున్నాయి. సుంకాల వలన ధరలు పెరుగుతాయనే ఆందోళనతో జనాలు స్టోర్లకు పరుగులు పెడుతున్నారు.

New Update
usa

Trump Tariffs

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల దెబ్బ ఓ మోత మోగిస్తోంది. దీని వలన పెద్ద పెద్ద వ్యాపారవేత్తల దగ్గర నుంచి రైతులు, వినియోగదారులు వరకూ అందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఎగుమతులు ఆగిపోతాయని, ధరలు పెరుగుతాయని ఆవేదన పడుతున్నారు. విదేశీ ఉత్పత్తులపై ట్రంప్ ప్రతీకార సుంకాలు పెంచేశారు. దీంతో అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులు తగ్గిపోతాయి. దాంతో వాటి ధరలు పెరుగుతాయి. ఇప్పుడు ఇదే ఆవేదన అమెరికా ప్రజలను ఆందోళనలో పడేసింది. మరోవైపు తమ ఉత్పత్తులకు గిరాకీ తగ్గతుందని రైతులు భయపెడుతున్నారు. 

స్టోర్లకు పరుగెడుతున్న జనాలు..

అమెరికాలో చాలా ఏళ్ళుగా ద్రవ్యోల్బణం ఎదుర్కొంటోంది. దాంతో అక్కడ అన్ని వస్తువుల రేట్లూ బాగా పెరిగిపోయాయి. దానికి తోడు ఇప్పుడు సుంకాల దెబ్బ ఒకటి. దీంతో అమెరికాలో చాలా వస్తువుల రేట్లు పెరగనున్నాయి. ఇలా అవ్వక ముందే ఆ వస్తువులను కొనుక్కు తెచ్చుకోవాలని అమెరికన్లు ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. తైవాన్ పై ట్రంప్ 32 శాతం సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతయ్యే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరుగుతాయి. దీంతో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, కెమెరాలకు ప్రస్తుతం డిమాండు పెరిగింది. కార్లు, ఇతర గృహోపకరణాలకూ పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయని  కంపెనీలు చెబుతున్నాయి.  

వ్యవసాయం పైనా..

ట్రంప్ సుంకాల ప్రభావంతో అమెరికా వ్యవసాయంపైనా పడుతోంది. ఆ దేశానికి అతి పెద్ద మార్కెట్ చైనా. ఇప్పుడు ట్రంప్ వలన చైనా కూడా సుంకాలను పెంచేసింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  అమెరికాలో పండే సోయాబీన్, జొన్నల్లో 50 శాతం చైనాకు ఎగుమతి అవుతాయి. వీటితో పాటూ మొక్కజొన్న, బీఫ్, చికెన్ లను కూడా చైనానే ఎక్కువగా ఎగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు చైనా సుంకాలను 34శాతం పెంచేసింది. దాంతో వాటికి డిమాండ్ తగ్గనుంది. దాంతో పాటూ ట్రంపం సుంకాలను పెంచిన వెంటనే అమెరికాలో పంట ధరలు తగ్గిపోయాయి. కొత్త సుంకాలతో చాలా మంది వ్యవసాయాన్ని వదిలేసే అవకాశముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ దేశంలో తయారయ్యే ‘బైజియు’ మద్యాన్ని తయారు చేసేందుకు అమెరికా నుంచి జొన్నలను చైనా దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు ఇతర దేశాలకు ఆ దేశం ఆర్డర్లు ఇస్తే అమెరికా రైతులు నష్టపోతారు. లాస్ట్ టైమ్ ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో రైతులు ట్రంప్ కు సపోర్ట్ చేశారు. అప్పుడు కోట్ల డాలర్లు వారికి సాయం చెయ్యడమే కారణం. కానీ ఈసారి ట్రంప్ అలా చేస్తారా లేదా తెలియదు. చేసినా కూడా రైతులు అందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. 

 today-latest-news-in-telugu | usa | trump tariffs | cars | laptop 

 

 ఇది కూడా చదవండి: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే

Advertisment
Advertisment
Advertisment