/rtv/media/media_files/2025/04/03/mjn8OApiZUSujCwo0des.jpg)
tariffs on islands Photograph: (tariffs on islands )
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ప్రపంచంలో అన్నీ దేశాలపై ఎగుమతి సుంకాలను భారీగా పెంచుతూ ఆయన ప్రకటించాడు. గురువారం ఏయే దేశంపై ఎంత సుంకాలు విధించాడో వైట్ హౌస్ నుంచి విడుదల అయ్యింది. ఈ క్రమంలో ట్రంప్ ఓ దీవిపై కూడా 10 శాతం టారిఫ్ ట్యాక్స్ విధించాడు. వింత ఏంటంటే.. అక్కడ మనుషులు ఉండరు. కేవలం పెంగ్విన్లు మాత్రమే నివసిస్తాయి.
Also read: Moon: చంద్రుడిపై నిర్మాణాలు.. బ్యాక్టీరియాతో ఇటుకల తయారీ!
ఇదే క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కేవలం 2వేల మంది మాత్రమే నివసించే మరో ఆస్ట్రేలియా భూభాగమైన నార్ఫోక్ ద్వీపంపై 29 శాతం సుంకాన్ని ప్రకటించటం గమనార్హం. అలాగే కేవలం 2వేల 500 మంది మాత్రమే నివసిస్తున్న మారుమూలన నార్వేజియన్ భూభాగాలైన జాన్ మోయెన్, స్వాల్బార్డ్ ప్రాంతాలను సైతం ట్రంప్ తన తాజా టారిఫ్స్ ప్రకటనలో విడిచిపెట్టలేదు.
Trump just slapped a 10% tariff on Heard and McDonald Islands — an uninhabited Antarctic territory home to 2 million penguins and 0 humans. Apparently, the penguins have been unfairly undercutting American exports. pic.twitter.com/nIqecis9qf
— Andrej Bärg (@bergfinance) April 3, 2025
The Trump administration has put a 10 percent tariff on the Heard Island and McDonald which has a population of 0 people and is inhabited only by penguins. pic.twitter.com/KCmb9nBIYD
— WarMonitor🇺🇦🇬🇧 (@WarMonitor3) April 2, 2025
ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సబ్ అంటార్కిటిక్ హిందూ మహాసముద్రంలోని హర్డ్ అండ్ మెక్‌డొనాల్డ్ దీవులపై పన్నులు ప్రకటించటమే. వాస్తవానికి ఈ దీవుల్లో మనుషులు నివసించరు. యునెస్కో వీటిని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో కూడా చేర్చింది. ఈ ప్రాంతం దాదాపు 80 శాతం మంచుతో కప్పబడి ఉంటుంది. రాతితో కూడిన ఈ దీవులు చీకటిగా ప్రజలు నివాసం లేకుండా ఉన్నాయి.
Also read: Emergency landing: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా
ఈ దీవులు ఆస్ట్రేలియా భూభాగం కిందకు వస్తాయి కాబట్టి.. వాటిని టారిఫ్స్ జాబితాలో చేర్చినట్లు వైట్ హౌస్ అధికారిని ఆక్సియోస్ తెలిపింది. ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం అమెరికా హెర్డ్ ఐలాండ్, మెక్ డొనాల్డ్ దీవుల నుంచి దాదాపు 1.4 మిలియన్ డాలర్లు విలువైన వస్తువులను దిగుమతి చేసుకున్నట్లు గార్డియన్ వార్తా సంస్థ నివేదించింది. కేవలం ఐస్, పెంగ్విన్లు మాత్రమే ఉండే ఈ ప్రాంతం నుంచి మెషినరీ, ఎలక్టికల్స్ దిగుమతి చేసుకోవటం పెద్ద మిస్టరీగా అనిపిస్తోందని నివేదికలో పేర్కొంది. అందుకేనేమో ట్రంప్ ఈ మారుమూల జనావాసం లేని దీవులను సైతం విడిచిపెట్టకుండా తన టారిఫ్స్ కిందకు తీసుకొచ్చారు.