Trump Deadline: ఇరాన్‌కు ట్రంప్ 5సార్లు 'డెడ్‌లైన్'.. అమెరికా (పొడిగింపు) పాలిటిక్స్

అమెరికా ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్‌ ఫిబ్రవరి 28న ప్రారంభించింది. అప్పటి నుంచి హర్మోజ్ జలసంధి తెరవాలని ట్రంప్ డెడ్‌లైన్ల పొడిగిస్తూ వస్తున్నాడు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ట్రంప్ సుమారు 5 సార్లు తన డెడ్‌లైన్లను పొడిగిస్తూ ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు.

New Update
Open Strait Of Hormuz Within 48 Hours Trump Warns iran

Open Strait Of Hormuz Within 48 Hours Trump Warns iran

పశ్చిమాసియ యుద్ధంలో ఇరు దేశాల దాడులు(iran america war) ప్రపంచ దేశాల సంక్షోభాలకు దారితీస్తే.. మరో వైపు ట్రంప్(47th us president donald trump) వార్నింగ్‌లు, డెడ్‌లైన్లు ఆసక్తికరంగా మారాయి. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై 2026 ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభించాయి. అమెరికా ఈ దాడులకు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెడితే, ఇజ్రాయెల్ రోరింగ్ లయన్ అని పిలిచింది. అప్పటి నుంచి హర్మోజ్ జలసంధి తెరవాలని ట్రంప్ డెడ్‌లైన్ల(Trump Deadline To Iran) పరంపర కొగసాగుతోంది. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రంప్ సుమారు ఐదు సార్లు తన డెడ్‌లైన్లను పొడిగిస్తూ ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. డెడ్‌లైన్ విధించడం, దాన్ని పొడిగించడం ట్రంప్‌కు అలవాటుగా మారింది. చమురు రవాణకు కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని, లేదంటే ఇరాన్ మౌలిక సదుపాయాలను నాశనం చేస్తానని ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ యుద్ధంలో ఇప్పటివరకు వేల సంఖ్యలో ఇరాన్ సైనికులు మరణించగా, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి.

Also Read :  యుద్ధంలో చక్రం తిప్పిన పాకిస్తాన్.. శత్రు దేశమైనా మెచ్చుకోవాల్సిందే!

ట్రంప్ విధించిన డెడ్‌లైన్స్

మార్చి 21 ఫస్ట్ వార్నింగ్: ఇరాన్ తన పట్టు వీడాలని మొదటిసారి 48 గంటల గడువు ఇచ్చారు. హర్మోజ్ జలసంధి ఓపెన్ చేయాలని డిమాండ్ చేశాడు.
మార్చి 23: చర్చలకు అవకాశం ఇస్తున్నట్లు చెబుతూ గడువును మరో 5 రోజులు పొడిగించారు.

మార్చి 26:దౌత్యపరమైన మార్గాల ద్వారా ఒత్తిడి పెంచుతూ గడువును మరో 10 రోజులు ముందుకు జరిపారు.

ఏప్రిల్ 4:పరిస్థితి విషమిస్తున్న నేపథ్యంలో చివరి హెచ్చరికగా 48 గంటల గడువు విధించారు.

ఏప్రిల్ 7/8 (పవర్ ప్లాంట్ & బ్రిడ్జ్ డే):

మంగళవారం రాత్రి 8 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 5:30) సమయం ఇచ్చారు. ఏప్రిల్ 7 గడువు ముగిసేలోపు ఇరాన్ లొంగిపోకపోతే, ఆ రోజును ఇరాన్‌లో "పవర్ ప్లాంట్ డే" "బ్రిడ్జ్ డే"గా మారుస్తానని (అంటే విద్యుత్ కేంద్రాలు, వంతెనలను బాంబులతో పేల్చేస్తానని) ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. 

Also Read :  వార్‌ ఎఫెక్ట్‌.. ఆప్రాంతానికి 10వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు

14 రోజుల కాల్పుల విరమణ: 

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇతర దేశాల మధ్యవర్తిత్వం వల్ల, తాజాగా ట్రంప్ ఈ దాడులను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అమెరికా, ఇరాన్ రెండు దేశాలు దాడులు ఆపేశాయి. ఈ 14 రోజుల్లో ఇరాన్ 10 కండీషన్లు, ట్రంప్ 15 పాయింట్ల ప్రతిపాదతన పరిశీలించనున్నారు. డీల్ ఓకే అయితే శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందానికి వస్తారు. చర్చల్లో భాగంగా ఏప్రిల్ 10 పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇరు దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు.

Advertisment
తాజా కథనాలు