/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
Donald Trump
అమెరికా, కెనడాల మధ్య సుంకాల యుద్ధం నడుస్తూనే ఉంది. అమెరికా మొదలెట్టిన ఈ వార్ ను కెనడా మరి కొనసాగిస్తోంది. అమెరికా కెనడా నుంచి వచ్చే ఉత్పత్తులు అన్నింటి మీదా 20 శాతం సుంకాలను విధించింది. అందుకు ప్రతిగా కెనడా కూడా అమెరికాకు టారీఫ్ ల దెబ్బ కొట్టింది. అమెరికాకు ఇచ్చే కరెంట్ మీద మొదట 20శాతం టారిఫ్ లను విధించింది. కానీ తరువాత దాన్ని 25శాతంగా మార్చింది.
డబుల్ సుంకాలు..
కెనడా చర్యలను ఇప్పుడు అమెరికా సీరియస్ గా తీసుకుంది. అందుకే కెనడా నుంచి వచ్చే మెటల్ ఉత్పత్తుల మీద సుంకాలను 50శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇది బుధవారం నుంచే అమల్లోకి వచ్చేలా చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్...వాణిజ్య కార్యదర్శిని ఆదేశించారు. దాంతో పాటూ కెనడాకు ట్రంప్ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. పాల ఉత్పత్తుల మీదా, విద్యుత్ మీద ఆ దేశం వేస్తున్న సుంకాలను తగ్గించకపోతే ఏప్రిల్ 2న యునైటెడ్ స్టేట్స్ లోకి వచ్చే కార్ల మీద కూడా టారీఫ్ లను గణనీయంగా పెంచుతామని చెప్పారు.
అయితే మెటల్ మీద విధిస్తున్న సుంకాల వలన వాటి ప్రీమియంలు పెరుగుతాయని అమెరికా వ్యాపారులు అంటున్నారు. యునైటెడ్ స్టేట్స్‌కు రవాణా చేసే ప్రాథమిక, మిశ్రమ అల్యూమినియంలో కెనడియన్ స్మెల్టర్లు ఎక్కువగా ఉన్నాయి. రవాణా, ప్యాకేజింగ్ మరియు నిర్మాణ పరిశ్రమలకు అల్యూమినియం చాలా ముఖ్యమైనది. గత ఏడాది అమెరికాకు ఎగుమతి అయిన అల్యూమినియంలో దాదాపు 70% లేదా 3.92 మిలియన్ మెట్రిక్ టన్నులు కెనడా నుండి వచ్చాయి.