/rtv/media/media_files/2025/01/11/d0rSPWBG9KtCwiAyLAbT.jpg)
Donald Trump, Vladimir Putin
ట్రంప్ చొరవతో ఎట్టకేలకు ఉక్రెయిన్, రష్యా వార్ ముగిసే అవకాశం కనిపిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దిశగా చర్చలు జరిపేందుకు తాను, రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకారానికి వచ్చామని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అదే విధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో కూడా ట్రంప్ మాట్లాడారు. అందరం కలిసి పని చేయాలని...యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. రష్యాలో బందీగా ఉన్న అమెరికా టీచరు మార్క్ ఫోగెల్ విడుదల అయిన తర్వాత తాను పుతిన్‌తో ఫోన్ లో మాట్లాడానని ట్రంప్ చెప్పారు. మరోవైపు ఫోగెల్ విడుదలకు ప్రతిగా రష్యాకు చెందిన నేరగాడు అలెగ్జాండర్ విన్నిక్‌ను అమెరికా విడుదల చేసింది. ఫోగెల్‌కు రష్యా కోర్టు 2021 ఆగస్టులో 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ వారం జర్మనీలో మ్యూనిచ్ లో జరిగే భద్రతా సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హాజరవనున్నారు. అక్కడ ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించనున్నారు. దాని తరువాత ఇరు దేశాల మధ్యనా శాంతి ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు.
Also Read: UN: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు..1400 మంది మృతి-ఐక్యరాజ్యసమితి
ట్రంప్ కు థాంక్స్..జెలెన్ స్కీ..
శాంతిని నెలకొల్పడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సుదీర్ఘ చర్చలు జరిపానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చెప్పారు. దౌత్య, ఆర్థిక, సైనిక అంశాలపై తాము మాట్లాడుకున్నామని తెలిపారు. అలాగే పుతిన్ తో జరిగిన చర్చల గురించి కూడా ట్రంప్ తనకు వివరించారని...శాంతి కోసం ఆయన కృషి చేస్తున్నందుకు అభినందనలు, అలాగే థాంక్స్ కూడా చెబుతున్నానని జెలెన్ స్కీ అన్నారు. యూఎస్ బలం, ఉక్రెయిన్, ఇతర దేశాల ఐకమత్యం రష్యాను శాంతివైపు నడిపిస్తాయని నమ్ముతున్నానని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు.