/rtv/media/media_files/2025/03/05/foScBv5E1n6qz9RRzHO7.jpg)
Us boy dream Photograph: (Us boy dream)
ట్రంప్ (Donald Trump) నిర్ణయాలు ఎప్పుడూ అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అంతేకాదు ఆయన కామెంట్స్ వార్తల్లో నిలుస్తాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో 13ఏళ్ల డీజే డేనియల్ (DJ Danial) అనే బాలుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా నియమించారు. ట్రంప్ నియాకమాన్ని స్వాగతిస్తూ అమెరికా సెనైట్ లో సభ్యులందరూ డీజే, డీజే అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ కారణం లేకపోలేదు. 13 ఏళ్ల డీజే డేనియల్‌కు పోలీసు అధికారి కావాలనే కల. కానీ.. డీజే బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. మరో 5నెలలు మాత్రమే అతను బతుకుతాడని డాక్టర్లు తెలిపారు. దీంతో చనిపోయేలోగా తన కల నిజం చేయాలని ట్రంప్ అనుకున్నాడు.
Also Read: terrorists attack: పాకిస్తాన్‌లో ఉగ్రదాడి.. 9 మంది సైనికులు మృతి
Trump Appointed 13 Year Old To US Secret Service
🚨President Trump ordered Secret Service Director Sean Curran to make 13-year-old DJ Daniel, who has "always dreamed of becoming a police officer," an agent of the Secret Service.
— Derrick Evans (@DerrickEvans4WV) March 5, 2025
DJ is a 13 year old cancer survivor. pic.twitter.com/vwYBmmsfLC
Also Read : హైదరాబాద్‌లో విషాదం.. కాబోయే భార్యను ఆటపట్టించబోయి మృతి.. అసలేమైందంటే..!
అమెరికా చట్టసభలో ట్రంప్ ఈ విషయం గురించి సభ్యులకు చెప్పాడు. యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా డీజేను నియమించాలని సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ సీన్ కుర్రాన్‌ను ట్రంప్ కోరారు. ఆయన దాన్ని అమలు పరుస్తూ డీజే డేనియల్‌కు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికన్స్ కల ఎవరూ ఆపలేరని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇది ప్రారంభం మాత్రమేనని ఇంకా ముందు చాలా మంది కలలు నిరవేరుతాయని ఆయన సెనైట్‌లో చెప్పారు.
Also Read: phone taping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఇంటర్‌పోల్ చేతికి నిందితులు..!
Also Read : సుంకాలతో డిష్యూం డిష్యూం..యూఎస్- చైనా- కెనడా వార్