/rtv/media/media_files/2025/03/24/rcrFvgKqt68RBqyjM39c.jpg)
Tiger Woods and Vanessa Trump
గోల్ఫ్ సూపర్‌స్టార్ టైగర్‌వుడ్స్ కీలక విషయం పంచుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ కోడలితో తాను రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. '' నీ ప్రేలో ఉంటే గాలిలో తేలినట్లుంది. నాపక్కన నువ్వుంటే జీవితం మరింత అద్భుతంగా ఉంటుందని'' రాసుకొచ్చారు. ఆమెతో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు.
Love is in the air and life is better with you by my side! We look forward to our journey through life together. At this time we would appreciate privacy for all those close to our hearts. pic.twitter.com/ETONf1pUmI
— Tiger Woods (@TigerWoods) March 23, 2025
Also Read: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు షాక్.. భారీగా వీసాలు తిరస్కరణ
Tiger Woods Confirms Relationship With Trump Ex Daughter-In-Law
ఈ విషయంలో తమ వ్యక్తిగత గోప్యతకు గౌరవం ఇచ్చినందుకు సన్నిహితులకు కృతజ్ఞతలు చెప్పారు. వెనెసా కూడా తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌లో టైగర్ వుడ్స్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. ట్రంప్ కొడుకు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు ఆమె మాజీ భార్య. దీంతో ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రంప్ జూనియర్ వెనెసాను 2005లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్ల మధ్య విభేదాలు వచ్చాయి. 2018లో తమ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్నారు.
Also Read: అదృష్టం అంటే ఈ అమ్మాయిదే.. కొత్తగా కొన్న ప్యాంట్ జేబులో డబ్బే డబ్బు!
ఆ తర్వాత ట్రంప్ జూనియర్‌కు 2020లో ఫాక్స్ న్యూస్ మాజీ హోస్ట్ కింబర్లీతో ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయితే ఆయన మరో అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్రంప్ జూనియర్ ఓ అమ్మాయిని చేత పట్టుకొని నడుస్తున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. అలాగే కింహర్లీతో ట్రంప్ జూనియర్ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది.
Also Read: ముస్లిం రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో గందరగోళం.. రాజ్యాంగంపై నడ్డా సంచలన కామెంట్స్!
Also Read : కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటు సభ్యుల జీతాలు, అలవెన్సులు పెంపు!
rtv-news | donald-trump | international news in telugu | latest-telugu-news | today-news-in-telugu