/rtv/media/media_files/2025/04/05/9Wy1qmcM58wxIQ6TnwVk.jpg)
houthi
యెమెన్‌లోని హుతీలు లక్ష్యంగా అమెరికా ఇటీవల భీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ దాడులకు సంబంధించిన వీడియోను అధ్యక్షుడు ట్రంప్ పంచుకున్నారు. దాడులు జరిగిన ప్రాంతంలోని డ్రోన్ దృశ్యాలను ట్రంప్ షేర్ చేశారు.
Also Read: Ap Weather Report: ఆ జిల్లాలలో పిడుగులతో భారీ వర్షాలు.. మరో మూడు రోజులు ఇంతే..
ఈ సందర్భంగా హూతీలు నౌకలపై దాడులు చేసేందుకు సమావేశమయ్యారని ఆయన ఆరోపించారు.కానీ వారు దాడులకకు పాల్పడకుండా చర్యలు తీసుకున్నామని వ్యాఖ్యానించారు.ఇక ట్రంప్‌షేర్ చేసిన వీడియోలో రౌండ్‌గా నిల్చొన్న ఒక సమూహం పై వైమానిక దాడి జరిగినట్లు కన్పిస్తోంది.
Also Read: Horoscope: నేడు ఈ రాశివారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి..!
ఇజ్రాయెల్ నౌక లపై దాడుల్నిపునరుద్ధరిస్తామని యెమెన్ తిరుగుబాటు దళం హుతీలు ఇటీవల ప్రకటించారు. దీంతో హుతీలకు బలమైన సంకేతాలు పంపాలని ట్రంప్ మార్చి 15న ఆదేశించారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో యూఎస్ దళాలు భారీగా దాడులు చేశాయి. ఈ దాడుల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా..అనేక మంది గాయాలపాలయ్యారు.
These Houthis gathered for instructions on an attack. Oops, there will be no attack by these Houthis!
— Donald J. Trump (@realDonaldTrump) April 4, 2025
They will never sink our ships again! pic.twitter.com/lEzfyDgWP5
ఈ సందర్భంగా ప్రపంచంలో ఎక్కడైనా జలమార్గాల్లో అమెరికా వాణిజ్య,నౌకాదళ స్వేచ్ఛగా వెళ్లకుండా ఏ ఉగ్రశక్తి ఆపలేదని ట్రంప్ స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే హుతీలకు మద్దతు ఇవ్వడం ఆపేయాలని ట్రంప్ ఇరాన్ ను హెచ్చరించారు. దీని పై టెహ్రాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పందిస్తూ..హుతీల దాడుల్లో తమ ప్రమేయం లేదన్నారు. వారు సొంత కారణాల వల్ల దాడులకు పాల్పడుతున్నారని...ఈ విషయంలో అగ్రరాజ్యం తమ పై ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
యూఎస్ దాడులను హూతీ పొలిటికల్ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది.దీని పై ప్రతిస్పందించేందుకు సిద్ధమేనని హెచ్చరించింది.
Also Read: Ap Mega DSC: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్...వారంలో మెగా డీఎస్సీ!
Also Read: Hyderabad: సికింద్రాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం!
yeman | video | israel | attacks | america | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates