/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-08T200843.237.jpg)
ప్రపంచంలో చాలా దేశాలతో పాటూ చైనా మీద కూడా ప్రతీకార సుంకాలను విధించారు ట్రంప్. ఆ దేశంపై ఏకంగా 54 శాతం టారీఫ్ లను ప్రకటించారు. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34శాతం సుంకాలను విధిస్తామని ప్రకటించింది. ఈ టారీఫ్ ల వార్ నేపథ్యంలో ట్రంప్ చైనాకు ఓ కొత్త ఆఫర్ ఇచ్చారు. బీజింగ్ పై సుంకాలను తగ్గించాలంటే వారు ఆ పని చేయాల్సిందే అని చెప్పారు. అదేంటంటే టెక్ టాక్ ను అమ్మేయడం.
టిక్ టాక్ ఇచ్చేయండి..
చైనా సోషల్ మీడియా యాప్ టిక్ టాక్. కానీ దీన్ని అమెరికా, భారత్ లు నిషేధించాయి. టిక్ టాక్ ద్వారా అమెరికా భద్రతా వ్యవహారాలు బయటకు వెళుతున్నాయని ఆ దేశం ఆరోపిస్తోంది. అందుకే దాన్ని బ్యాన్ చేసింది. అయితే దీని వలన చైనాకు చాలా నష్టం వస్తోంది. దీంతో దీని విషయమై చైనా ఎప్పటి నుంచో అమెరికాతో బేరసారాలాడుతోంది. ఆమధ్య ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ టిక్ టాక్ ను కొనేస్తున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. అలాగే చైనా అమెరికా సుప్రీంకోర్టులో కేసు వేసిందని ఇలా చాలా రకాల న్యూస్ బయటకు వచ్చింది. మొత్తానికి ఆ విషయం ఎటూ తేలలేదు. ఇప్పుడు సుంకాల నేపథ్యంలో టిక్ టాక్ ను మరోసారి తెర మీదకు తీసుకువచ్చారు ట్రంప్. చైనాకు విధించిన సుంకాలను తగ్గించాలంటే ఆ దేశం తమకు టిక్ టాక్ ను అమ్మేయాలని డిమాండ్ చేశారు. ట్రంప్ వచ్చాక టిక్ టాక్ మీద బ్యాన్ ను ఎత్తేసి...దాని బ్యాన్ 75 రోజుల పాటూ వాయిదా వేయాలని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ తమకు అమ్మేయాలని అడుగుతున్నారు. మొత్తానికి ట్రంప్ వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి ముడిపెడుతున్నారు.
మరోవైపు చైనా భయపడింది. తప్పుడు నిర్ణయం తీసుకుంది అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వారికి మరో మార్గం లేదు అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమెరికా టారీఫ్ లకు ప్రతిగా చైనా విధించిన 34శాతం సుంకాలపై ట్రంప్ స్పందించారు. అసలు ముందు నుంచీ చైనా గోలపెడుతూనే ఉంది. యూఎస్ విధించిన సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని ఆరోపించింది. అగ్రరాజ్యం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, బెదిరింపులకు పాల్పడుతోందని చైనా అంటోంది. ట్రంప్ విధించిన సుంకాలపై ఇప్పటి వరకు కెనడా, చైనాలు మాత్రమే ధీటుగా సమాధానాలు చెప్పాయి. దానికి ప్రతిగా ఆ దేశాలు కూడా సుంకాలను పెంచాయి. తాజాగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపైనా చైనా 34శాతం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 10 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.
today-latest-news-in-telugu | tik-tok | china | america president donald trump | donald trump tariffs
Also Read: USA: అమెరికాకు ఎగుమతులను ఆపేస్తున్న బడా కంపెనీల కార్లు..జాగ్వార్, ల్యాండ్ రోవర్ బ్రేక్