America: ట్రంప్ హోటల్‌ ముందు పేలుడు!

అమెరికాలోని లాస్ వెగాస్‌లోని డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ హోటల్‌ బయట టెస్లా సైబర్ ట్రక్ లో భారీ పేలుడు సంభవించింది.ఈ ఘటనలో ఒకరు మరణించాగా..ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.ట్రక్‌ లో పేలుడు పదార్థాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

New Update
trump

trump

America: అమెరికాలోని లాస్ వెగాస్‌లోని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ హోటల్‌ బయట టెస్లా సైబర్ ట్రక్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించాగా.. ఏడుగురు తీవ్రంగా  గాయపడ్డారు. కారులో ఉన్న పేలుడు పదార్థాల కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు వివరించారు.

Also Read: Pawan Kalyan: "హరిహర వీరమల్లు" ఫస్ట్ సింగిల్.. స్వయంగా పాడిన పవర్ స్టార్

అలాగే, న్యూ ఆర్లీన్స్‌లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఓ దుండగుడు తన వాహనంతో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదా15 మంది వరకు పౌరులు మరణించారు.ఈ రెండు ఘటనలపై టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ పలుఅనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ఉగ్రవాద చర్యగా కనిపిస్తోందన్నారు.

Also Read:  Gandhi TathaChettu: థియేటర్స్ లో సుకుమార్ కూతురు అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్..!

పేలుడు పదార్థాల కారణంగా..

ఈ పేలుడుకు గల కారణమైన రెండు కార్లను టూర్‌ రెంటల్ వెబ్‌ సైట్‌ నుంచి అద్దెకు తీసుకున్నారని మస్క్‌ చెప్పుకొచ్చారు. బహుశా రెండు ఘటనలకు సంబంధం ఉండొచ్చని ఎక్స్‌ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. లాస్ వెగాస్‌లో జరిగిన ఘటన పేలుడు పదార్థాల కారణంగా సంభవించింది.. టెస్లా వాహనం వల్ల కాదని ఎలాన్ మస్క్‌ తెలిపారు.

Also Read: CM Revanth: నేను మారాను.. మీరు కూడా మారండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

అలాగే, ఈ ఘటనపై టెస్లా సీనియర్ బృందం పరిశీలిస్తుందని తెలిపారు. రెండు ఘటనలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ ఎఫ్‌బీఐ విచారణ చేస్తోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అన్నారు. ఇక, న్యూ ఆర్లీన్స్‌ ఘటనపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా రియాక్ట్ అయ్యారు. మన దేశంలో వలసల కారణంగా వస్తున్న నేరస్థుల సంఖ్య అధికంగా ఉందని హెచ్చరించా.. నా మాటలను డెమోక్రాట్లు, యూఎస్ మీడియా ఖండించాయని ఆయన పేర్కొన్నారు. 

Also Read: Maoists: సీఎం ఫడ్నవీస్ ముందు లొంగిపోయిన 11 మంది మావోయిస్టులు

నేను చెప్పింది నిజమేనని తాజా ఘటనతో తేలింది.. గతంలో కంటే అమెరికాలో క్రైమ్‌ రేట్‌ ప్రస్తుతం పెరిగింది.. ప్రమాదంలో మృతి చెందినవారికి సంతాపం తెలియజేస్తున్నాం.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు