Terrorist Amir Hamza: పాపం పండింది.. పాక్ లోని ఆ దుర్మార్గుడిపై కాల్పులు.. నడి రోడ్డు మీదే..!

పాకిస్థాన్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాద సంస్థ లష్కర్‌- ఇ తొయిబా సహా వ్యవస్థాపకుడు అమీర్‌ హమ్జా పై కాల్పులు జరిగాయి. లాహోర్‌లోని ఓ న్యూస్‌ ఛానల్‌ బయట కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు.

New Update
Terrorist Amir Hamza, LeT co-founder, shot outside news channel office in Lahore

Terrorist Amir Hamza, LeT co-founder, shot outside news channel office in Lahore

పాకిస్థాన్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాద సంస్థ లష్కర్‌ - ఇ తొయిబా(lashkar-e-taiba) సహా వ్యవస్థాపకుడు అమీర్‌ హమ్జా పై కాల్పులు జరిగాయి. లాహోర్‌లోని ఓ న్యూస్‌ ఛానల్‌ బయట కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ హమ్జాను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుసతోంది. లష్కర్‌ ఇ తోయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపక సభ్యుల్లో అమీర్ హమ్జా ఒకరు. ఇతడు మరో ఉగ్రవాది హఫీజ్ సయ్యద్‌తో కలిసి ఈ ఉగ్ర సంస్థను స్థాపించాడు. 

Also Read: అమెరికాలో అదృశ్యమైన 10 మంది 'మాస్టర్ మైండ్' శాస్త్రవేత్తలు.. వ్యూహాం వెనుక చైనా, రష్యాల హస్తం ?

అమీర్ హమ్జా ఎవరు ?

అమీర్ హమ్జా అఫ్గానిస్థాన్  ముజాహిదీన్లలో ఒకడు. భారత్‌లో జరిగిన అనేక ఉగ్ర దాడులతో ఇతడికి సంబంధం ఉంది. తన ఉద్వేగపూరిత ప్రసంగాలు, రాతలతో ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. 2002లో ఇతడు రాసిన "ఖఫిలా దావత్ ఔర్ షహాదత్" (ప్రచార, బలిదానాల యాత్ర) అనే పుస్తకం ఉగ్రవాద వ్యాప్తిలో ప్రధాన పాత్ర పోషించింది.

Also Read: ఇరాన్‌లో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. ప్లాన్ అదేనా ?

మరోవైపు అమెరికా ట్రెజరీ విభాగం ఇప్పటికే లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. అంతేకాదు అమీర్ హమ్జాను ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. లష్కరే తోయిబా కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉంటూనే నిధులను సేకరించడం, రిక్రూట్‌మెంట్ చేయడం, అరెస్టయిన మిలిటెంట్ల విడుదల కోసం చర్చలు జరపడం లాంటి కీలక పనులను హమ్జా పర్యవేక్షించేవాడు. అలాగే లష్కరే అధికారిక పత్రిక "మజల్లా అల్-దావా"కు వ్యవస్థాపక ఎడిటర్‌గా కూడా ఇతడు పనిచేశాడు.

ఇక 2018లో పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్నటువంటి 'జమాత్-ఉద్-దావా' అలాగే 'ఫలా-ఎ-ఇన్సానియత్ ఫౌండేషన్' లాంటి స్వచ్ఛంద సంస్థలపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది. దీంతో ఆ సమయంలో హమ్జా లష్కరేకు దూరంగా ఉన్నట్లు నటింటి "జైష్-ఎ-మన్‌ఖఫా" అనే కొత్త చీలిక వర్గాన్ని ప్రారంభించాడు. అతడు ఇప్పటికీ జమ్మూకశ్మీర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించేదుకే ఈ కొత్త గ్రూప్‌ను నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భారతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ కొత్త సంస్థ పాక్‌లో ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా పనిచేస్తోంది. అమీర్ హమ్జా ఇప్పటికీ లష్కర్ ఇ తోయిబా అగ్రనాయకులతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నాడని తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు