/rtv/media/media_files/2025/01/18/cqRDJc4K18i7UpqzlvWe.jpg)
death
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి అక్కడ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. సాయి కుమార్ రెడ్డి అనే విద్యార్థి న్యూయార్క్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సాయి కుమార్ న్యూయార్క్‌లోని పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. అయితే ఇటీవల ఫెడరల్ అధికారులు తనిఖీలు చేయగా సాయుకమార్ పాస్‌పోర్టును సీజ్ చేశారు. దీంతో భయాందోళనకు గురైన ఆ యువకుడు తాను పనిచేస్తున్న చోటే ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read: కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన పాకిస్థాన్ హిందువులు
అయితే సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలియలేదని తెలుస్తోంది. అతడి స్నేహితులు అమెరికా నుంచి తెలుగు టీవీ ఛానళ్లకు ఈ సమాచారం అందించగా.. ఓ మీడియా ఛానల్ ఈ ఘటన గురించి ప్రసారం చేసింది. సాయి కుమార్ కుటుంబ సభ్యుల వివరాలు తెలియకపోవడంతో ఈ సమాచారం వాళ్లకి అందించలేకపోయామని అతడి స్నేహితులు చెప్పారు. రెండు రోజుల క్రితం అమెరికా నుంచి భారతీయ అక్రమ వలసదారును పంజాబ్‌లోని అమృత్‌సర్ ఎయిర్‌పోర్టుకు తరలించిన సంగతి తెలిసిందే.
అమెరికాలో మరో 18 వేల మంది భారతీ అక్రమ వలసదారులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సాయి కుమార్ రెడ్డి వద్ద పాస్‌పోర్టు లేకపోవడంతో బలవంతంగా భారత్‌కు పంపిస్తారనే భయంతో సూసైడ్ చేసుకున్నట్లు అతడి స్నేహితులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితమే అమెరికా నుంచి అక్రమంగా వలస వెళ్లిన వారిని అమృత్‌సర్‌కు తిప్పి పంపారు. మరో 18వేల మందిని గుర్తించినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో సాయికుమార్ రెడ్డి పాస్‌పోర్ట్ లేకపోవడం, బలవంతంగా భారత్‌కు తిప్పి పంపుతారనే ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడినట్టు స్నేహితులు చెబుతున్నారు. సాయి కుమార్ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. అమెరికాలో డిపోర్టేషన్ వేటుపై అక్కడ ఉంటున్న భారతీయ వలసదారులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: కెనడాలో 20 వేల మంది ఇండియన్ స్టూడెంట్స్ మిస్సింగ్.. వారంతా ఎక్కడ?