ట్రంప్ (Donald Trump) కార్యవర్గంలో మస్క్ (Elon Musk) సారథ్యం వహిస్తోన్న డోజ్ లో ఓ తెలుగు కుర్రాడికి స్థానం దక్కింది. తెలుగు సంతతికి చెందిన యువ ఇంజినీర్ ఆకాశ్ బొబ్బాను మస్క్ నియమించుకున్నారు. ఆకాశ్‌తో సహా ఆరుగురు యువకులను డోజ్‌లో రిక్రూట్ చేసుకున్నారు. వీరంతా 19 నుంచి 24 ఏళ్లలోపు వారే కావడం మరో విశేషం.. అత్యంత కీలకమైన ప్రభుత్వ వ్యవస్థలో వీరిని నియమించడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
Also Read: America: అక్రమ వలసదారులతో భారత్ కు పయనమైన అమెరికా విమానం!
Elon Musk - Akash
ప్రభుత్వ వృథా ఖర్చులను తగ్గించడం, వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా డోజ్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. 19 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు గల యువ నిపుణుల బృందాన్ని నియమించడం, వారిలో కొందరు కాలేజీ విద్య ఇంకా పూర్తి చేయనివారు కూడా ఉండటం గమనార్హం. ఓ యువకుడు ఇంకా చదువుతున్నట్లు సమాచారం.
Also Read: Trump: మెక్సికో, కెనడాకు బంపరాఫర్ ఇచ్చిన ట్రంప్ ..నెల రోజుల పాటు ఇక ఆ కష్టాలు ఉండవు!
వారి అర్హతలు, సున్నితమైన ప్రభుత్వ డేటా వారికి యాక్సెస్ ఇవ్వడంపై ఆందోళన చెందుతున్నారు.ఇక, ఆకాశ్ బొబ్బా విషయానికి వస్తే నిర్వహణ, వ్యవస్థాపకత, సాంకేతిక కార్యక్రమంలో భాగంగా యూసీ బర్కిలీకి హాజరయ్యాడు. మెటా, పలాంటిర్, హెడ్జ్ ఫండ్ బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్‌లో ఇంటర్న్‌గా పనిచేశాడు. ఏఐ; డేటా ఎనాలిసిస్, ఫైనాన్షియల్ మోడలింగ్‌లో అనుభవం ఉంది. ఆకాశ్ అంతర్గత ప్రభుత్వ రికార్డులలో ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ లో ‘నిపుణుడు’గా పేర్కొన్నారు.
Also Read: MMTS Trains: రూ.20 టికెట్‌తో గంటలో హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్టకు...ఎంఎంటీఎస్ రైలు!
మస్క్‌కు చెందిన కృత్రిమ మేధ సంస్థ xAIలో కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్ అమండా స్కేల్స్‌కు ఆకాశ్ రిపోర్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది.ఇక, యూసీ బర్కిలీలో ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గురించి.. ఆకాశ్ సహచరుడు చారిస్ జాంగ్ ఎక్స్‌లో వెల్లడించారు. ఆకాశ్ ప్రతిభ, కోడింగ్ నైపుణ్యాలను తెలియజేస్తూ ఆ అద్భుతమైన సంఘటనను అతడు ఈ సందర్భంగా అతను గుర్తుచేసుకున్నాడు. ‘ప్రాజెక్ట్ గడువుకు రెండు రోజుల ముందు ఎలా అయ్యిందో తెలియకుండా మొత్తం డేటా డిలీట్ అయిపోయింది.
కానీ, ఆకాశ్ మాత్రం నిరాశపడకుండా మాకు కూడా ధైర్యం చెప్పి ఒక్క రాత్రిలోనే దానిని మళ్లీపూర్తిచేశాడు’ అని చెప్పుకొచ్చాడు. అందరికంటే మేమే ముందుగా ప్రాజెక్ట్ నివేదిక సమర్పించి.. మొదటిస్థానంలో నిలిచామని వివరించాడు.