/rtv/media/media_files/2025/03/19/MQ61qAml7QRUONLNDo94.jpg)
Sunita Williams
తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపాక తాజాగా భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమిపైకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈమెకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. త్వరలోనే ఆమె భారత పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆమె.. తన కుటుంబ సభ్యలతో సమయం గడిపి భారత్‌కు వచ్చే అవకాశం ఉందని ఆమె బంధువులు చెప్పారు.
Also Read: దొంగలుగా మారిన బీఎస్సీ విద్యార్థినులు.. ఆ ఇళ్లే టార్గెట్
సునీతా విలియమ్స్ భూమిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యాక గుజరాత్‌లోని ఆమె పూర్వీకుల గ్రామమైన ఝూలాసన్‌లో సందడి వాతావరణం నెలకొంది. గ్రామస్థులు బాణసంచా కాల్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. సునీతా త్వరలోనే భారత్‌కు రానుందని ఆమె బంధువులు చెప్పారు. మేమందరం ఆమెకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. ఆమె తన కుటుంబంతో కలిసి ఓ స్పెషల్ వెకేషన్‌ను ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ప్రధాని మోదీ కూడా సునీతా విలియమ్స్‌కు స్వయంగా లేఖ రాశారు. భారత్ మీకోసం ఎదురుచూస్తోందని.. మీకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అంతేకాదు సునీతా సైతం గతంలో ఎన్నోసార్లు భారత్‌పై ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. పూర్తిగా రికవరీ అయ్యి, నడచేవరకు సునీత వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారు. అయితే ఆమె భారత పర్యటనపై మరికొన్ని రోజుల్లో్ అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: భర్తను చంపి.. సిమెంట్ డ్రమ్‌లో కలిపేసి: ప్రియుడికోసం నేవి అధికారి భార్య ఘోరం!
ఇదిలాఉండగా.. 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఉన్న సంగతి తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున (భారత కాలమాన ప్రకారం) స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సూల్స్ ద్వారా ఫ్లొరిడా తీరప్రాంతాల్లో ల్యాండ్ అయ్యారు. సునీతా విలియమ్స్ భారత్ రాక కోసం దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు.
Also Read: నేనొక మూర్ఖున్ని...కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు