/rtv/media/media_files/2025/03/16/5H4YLcf00xwQ6liYYGHP.jpg)
ISS 123 Photograph: (ISS 123)
అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీతా విలియన్స్, బుచ్ విల్మోర్‌లను భూమి మీదకు తీసుకురావడానికి వెళ్లిన క్రూ 10 మిషన్ విజయవంతంగా ISS చేరుకుంది. శుక్రవారం ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌లో డ్రాగన్ స్పేస్‌షిప్ బయలుదేరింది. అది (ఈరోజు) ఆదివారం ఉదయం 10 గంటలకు రెండు స్పేస్ సెంటర్‌తో డాకింగ్ ప్రక్రియ చేయడం విజయవంతమైంది. SpaceX క్రూ 10 మిషన్‌లోని వెళ్లిన నలుగురు సిబ్బంది సునీతా విలియమ్స్, విల్మోర్‌లను కలుసుకున్నారు. క్రూ 10 మిషన్‌లో NASA వ్యోమగాములు అన్నే మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ వ్యోమగామి టకుయా ఒనిషి మరియు రోస్కోస్మోస్ కాస్మోనాట్ కిరిల్ పెస్కోవ్‌లు ISSకి చేరుకుంటారు.
All the hugs. 🫶
— NASA's Johnson Space Center (@NASA_Johnson) March 16, 2025
The hatch of the SpaceX Dragon spacecraft opened March 16 at 1:35 a.m. ET and the members of Crew-10 entered the @Space_Station with the rest of their excited Expedition 72 crew. pic.twitter.com/mnUddqPqfr
Also Read : Kumbh Mela: కొంపముంచిన కుంభమేళా పబ్లిసిటీ.. ఇప్పుడు రూ.12.8 కోట్ల ట్యాక్స్ కట్టేదెలా..?
2024 జూన్‌లో దాదాపు వారం రోజుల మిషన్ కోసం ISSకు వెళ్లిన వీరు తిరిగి వచ్చే క్రూలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో 9 నెలలుగా వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వారి భూమి మీదకు తిరిగి తీసుకువచ్చే పని ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. ఆ బాధ్యతలు ఎలన్ మస్క్‌కు అప్పగించారు. మరికొన్ని గంటల్లో నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్‌లు భూమి మీదకు రానున్నారు.
Crew 10 Dragon vehicle arriving! pic.twitter.com/3EZZyZW18b
— Don Pettit (@astro_Pettit) March 16, 2025
Also read: Padma Awards: పద్మ అవార్డ్స్‌కు నామినేషన్ స్వీకరణ..లాస్ట్ డేట్ ఎప్పుడంటే?