Iran: హర్మూజ్‌ మీదుగా వెళ్లే భారతీయ నౌకలకు ఆటంకం ఉండదు.. ఇరాన్ కీలక హామీ

ఇరాన్‌ భారత్‌కు కీలక హామీ ఇచ్చింది. హర్మూజ్ మీదుగా వెళ్లే భారతీయ నౌకలకు ఎలాంటి ఆటంకం ఉండదని తెలిపింది. ఈ రూట్‌ భారత్‌కు ఎప్పుడూ తెరిచే ఉంటుందని భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ వెల్లడించారు.

New Update
Strait Open For India, US "Miscalculated", Says Iran's Envoy

Strait Open For India, US "Miscalculated", Says Iran's Envoy

Iran: హర్మూజ్‌ జలసంధిని అమెరికా దిగ్బంధించింది. సముద్రంలో భారీ నౌకలను మోహరించి ఇరాన్ పోర్టులకు నౌకలు వెళ్లకుండా అడ్డుకుంటోంది. ఇలాంటి ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌ భారత్‌కు కీలక హామీ ఇచ్చింది. హర్మూజ్ మీదుగా వెళ్లే భారతీయ నౌకలకు ఎలాంటి ఆటంకం ఉండదని తెలిపింది. ఈ రూట్‌ భారత్‌కు ఎప్పుడూ తెరిచే ఉంటుందని భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ వెల్లడించారు. ఇరాన్‌కు భారత అత్యంత సన్నిహిత దేశమని.. నౌకల రాకపోకల విషయంలో ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. 

Also Read: హార్ముజ్‌ జలసంధిపై బ్రిటన్-ఫ్రాన్స్ కొత్త ప్లాన్.. ట్రంప్‌‌కు ఎదురుదెబ్బేనా?

మరోవైపు ఇటీవల ఇస్లామాబాద్‌లో నిర్వహించిన అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఫతాలీ అమెరికా తీరును తప్పుబట్టారు. అమెరికా చర్చల కోసం కాకుండా.. ఇరాన్‌ను లొంగదీసుకునేందుకే ఈ చర్చలకు వచ్చిందంటూ విమర్శలు చేశారు. ఇరాన్ హక్కులను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. చట్టవిరుద్ధమైన డిమాండ్లను అమెరికా పక్కన పెడితేనే భవిష్యత్తులో చర్చలు జరుగుతాయని తెలిపారు. 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా వెళ్లిపోవడంపై గత చేదు అనుభవాలను ఆయన గుర్తు చేశారు.

మరోవైపు హర్మూజ్‌లో అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని ఫతాలీ వార్నింగ్ ఇచ్చారు. ఈ చర్యల వల్ల త్వరలో చమురు ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. ఇరాన్ చేపట్టిన దాడులు కేవలం తమ మౌలిక సదుపాయాలను టార్గెట్‌ చేసుకున్న అమెరికా సైనిక స్థావరాలపైనే తప్ప, పొరుగు దేశాలపై కాదని ఆయన తేల్చిచెప్పారు. 

Also Read: హార్మూజ్ కింగ్ మేకర్ ఎవరు..?

ఇస్లామాబాద్‌లో చర్చలు విఫలం కావడం వెనుక ఇజ్రాయెల్ ప్రమేయం ఉన్నట్లు ఇరాన్ ఆరోపణలు చేస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే  ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఫోన్ చేశారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసమే అమెరికా ఈ చర్చలను పక్కదారి పట్టించిందని విమర్శించారు. యుద్ధం నుంచి సాధించలేని దాన్ని అమెరికా చర్చలతో సాధించాలని చూసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisment
తాజా కథనాలు