Trump-panama canal: పనామా కాలువ పై... ట్రంప్‌ ఇచ్చిన పవర్‌ ఫుల్‌ అప్డేట్‌!

పనామా కాలువ పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్న ట్రంప్‌ త్వరలోనే దీని పై శక్తిమంతమైన చర్య ఉండనుందని ప్రకటించారు.

New Update
trumppanama

trumppanama

బాధ్యతలు చేపట్టకముందు నుంచే పొరుగు దేశాల పై హెచ్చరికలతో కయ్యానికి కాలు దువ్విన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌...ఇప్పుడు అన్నంత పని చేసేలాగా కనిపిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో,చైనాల పై సుంకాలతో విరుచుకుపడిన ఆయన..తాజాగా పనామా కాలువ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Flight Accident: రన్‌ వే పై టేకాఫ్‌ అవుతుండగా విమానంలో చెలరేగిన మంటలు!

ఈ కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్న ట్రంప్‌ త్వరలోనే దీని పై శక్తిమంతమైన చర్య ఉండనుందని ప్రకటించారు. పనామా కాలువ ను చైనా పరోక్షంగా నిర్వహిస్తోంది. మేం దాన్ని చైనాకు ఇవ్వలేదు.కానీ ఒప్పందాన్ని పనామా ఉల్లంఘిస్తోంది. అందుకే కాలువను తిరిగి తీసుకోవాలనుకుంటున్నాం. లేదా త్వరలోనే దీనికి సంబంధించి శక్తిమంతమైన చర్య ఉండబోతుందని ట్రంప్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

Also Read: Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. మూడు రోజుల పాటు ఆ టికెట్లు రద్దు!

అయితే దీనికి బలగాల అవసరం ఉండకపోవచ్చని అన్నారు.ఇదిలా ఉండగా..అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఆదివారం పనామా అధ్యక్షుడు జోస్‌రౌల్‌ ములినోతో భేటీ అయిన సంగతి తెలిసిందే. పనామా కాలువ విషయంలో చైనా జోక్యాన్ని,నియంత్రణను అడ్డుకోవాలి.లేదంటే వాషింగ్టన్‌ తగిన చర్యలు తీసుకుంటుందని ములినోతో అగ్రరాజ్య విదేశాంగ మంత్రి గట్టిగా చెప్పారు.

ఈ భేటీ అనంతరం పనామా అధ్యక్షుడు మాట్లాడుతూ..అమెరికా దురాక్రమణకు మేం భయపడబోం అని తెలిపారు. చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కాలువను 1914లో అమెరికా నిర్మించింది. ఆ తరువాత ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు 1999 డిసెంబర్‌ లో దీన్ని పనామాకు ఇచ్చేసింది.

అయితే అమెరికా వాణిజ్య, నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని..వీటిని తగ్గించాలని ట్రంప్‌ కోరారు.  లేదంటే ఆ కాలువను తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.దీంతో ఇరు దేశాల మధ్య వివాదం రోజురోజుకి ముదురుతుంది. 

Also Read: Ap -Prakasam: పింఛన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి మిస్సింగ్.. తీరా చూస్తే ట్విస్ట్‌ అదిరిందిగా..!

Also Read: Tanuku SI: పిల్లల్ని, విజ్జిని చూస్తుంటే బాధేస్తోంది...కంటతడి పెట్టిస్తున్న తణుకు ఎస్సై మూర్తి చివరి మాటలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Iran Harbor

Iran Harbor

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించిన ఘటన చోటుచేసుకుంది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

చమురు, పెట్రోకెమికల్స్ కారణంగా..

నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ కంటైయినర్లలో చమురు, పెట్రోకెమికల్స్ ఉన్నాయి. వీటి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment